Ads
- చిత్రం : అల్లూరి
- నటీనటులు : శ్రీ విష్ణు, కయదు లోహర్, తనికెళ్ళ భరణి, సుమన్, రాజా రవీంద్ర తదితరులు
- నిర్మాత : బెక్కం వేణుగోపాల్ (లక్కీ మీడియా బ్యానర్)
- దర్శకత్వం : ప్రదీప్ వర్మ
- సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022
Video Advertisement
స్టోరీ :
20 ఏళ్ళల్లో ఎన్నో బదిలీలను ఎదుర్కొన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన హీరో. అతనే ఎ. రామరాజు (శ్రీవిష్ణు). అయితే ఒక టైం లో ఏం అవుతుందంటే రామరాజు కి ఓ ఘోరమైన రాజకీయ నాయకుడు ఎదురవుతాడు. అంతే మొత్తం జీవితం మారిపోతుంది. ఇలా స్టోరీ రన్ అవుతుంది. అదే ఈ సినిమా కధ.
రివ్యూ :
పోలీస్ సినిమాల ట్రెండ్ గత కొంత కాలం నుండి కొనసాగుతూనే ఉంది. హీరో పోలీస్ గా నటిస్తే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఈ సినిమాపై కూడా అలాగే అంచనాలు ఉన్నాయి. కానీ హీరో పోలీస్ పాత్ర పోషించడాన్ని కొంతమంది దర్శకులు హ్యాండిల్ చేసే విధానం ఇంకా కొంచెం బాగుంటే సినిమా బాగా వచ్చేది ఏమో అనిపిస్తుంది. ఇది కూడా అలాంటి సినిమానే. సినిమా కథ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకటి, రెండు సీన్స్ తప్ప అంత మంచి సీన్స్ కూడా సినిమాలో ఏమీ ఉన్నట్టు అనిపించదు.
శ్రీ విష్ణు పోలీస్ పాత్రలో బాగా నటించాడు. పైగా ఈ పాత్ర అతనికి కొత్త. అలానే ఆ పాత్ర కి మంచి వేరియేషన్స్ వున్నాయి. ఇది మనం మెచ్చుకోవాలి. కయదు లోహర్ పాత్ర కి అంత స్కోప్ లేకపోయింది. మిగిలిన పాత్రలు కూడా బాగున్నాయి. తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర , పృధ్వీ రాజ్, రవి వర్మ వీరంతా కూడా బాగా చేసారు.
ప్లస్ పాయింట్స్ :
- శ్రీవిష్ణు యాక్టింగ్.
- కొన్ని యాక్షన్ బ్లాక్‌లు.
మైనస్ పాయింట్స్:
- రొటీన్ సీన్స్.
- స్క్రీన్ ప్లే.
రేటింగ్ : 2.25/5
ట్యాగ్ లైన్ :
కథ నుండి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. సినిమా నుండి కొత్తదనం ఏమీ కోరుకోకుండా, ఏదో ఒక సినిమా చూద్దామా అనుకునేవారికి అల్లూరి ఒక్క సారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
Trailer:
End of Article