Home Filmy Adda ప్రశంసలు పొందుతున్న మెగా హీరో “సాయి ధరమ్ తేజ్”..! కారణమేంటంటే..?

ప్రశంసలు పొందుతున్న మెగా హీరో “సాయి ధరమ్ తేజ్”..! కారణమేంటంటే..?

by Anudeep

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

గతేడాది సెప్టెంబర్ లో బైక్ పై వెళ్తూ తేజ్ ..ప్రమాదవశాత్తూ కింద పడిన విషయం తెలిసిందే.. దాంతో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. మొదట్లో అది చిన్న ప్రమాదమే అనుకున్నా.. తర్వాత కాదని తెల్సింది. 35 రోజులు హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

sai dharam tej reacts to netizen tweet
పూర్తిగా కోలుకున్న తర్వాత ఇటీవలే తిరిగి సినిమా షూటింగ్స్‌లో జాయిన్ అవుతున్నాడు. కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు సాయి. ఆ సినిమా షూటింగ్ మొదలైంది. తేజ్ కెరీర్ లో ఇది 15వ సినిమా. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కుత్బుల్లాపూర్లో హెచ్ ఎంటీ అర్బన్ ఫారెస్ట్రీలో జరిగింది. ఓ క్లిష్టమైన షెడ్యూల్ని ఇక్కడ షూట్ చేసి పూర్తి చేశారు. అయితే షూటింగ్ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా చెత్తతో నింపేశారట.

netizens praising sai dharam tej for this action
సినిమా షూటింగ్ అంటే వందలమంది పని చేస్తారు. కాబట్టి కాస్త చెత్త అవ్వడం జరుగుతుంది. అయితే ఆ ప్రాంతాన్ని చిత్రయూనిట్ శుభ్రం చేయించలేదట. చిత్రీకరణలో భాగంగా ఆ ప్రాంతమంతా చిందర వందరగా తయారైంది. షూటింగ్ స్పాట్ లో చెత్తా చెదారం వ్యర్ధాలతో అశుభ్రంగా మారిపోయింది.

sai dharam tej reacts to netizen tweet
దాంతో ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా దీనిపై చిత్రయూనిట్ కు సమాచారం అందించాడు. ఆ ట్వీట్ కు జీహెచ్ఎంసీ అధికారులతోపాటు, తేజ్ ను కూడా ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ పై తేజ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా టీమ్ దీన్ని చూసుకుంటుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నారు. చెప్పినట్టే వెంటనే అక్కడి చెత్తను తొలగించారు. దాంతో తేజ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

sai dharam tej reacts to netizen tweet
సాయి తేజ్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా గుప్త దానాలు చేశాడు తేజ్. తాజాగా జరిగిన ఈ ఘటనతో నెటిజన్లు సాయి ధరమ్ తేజ్ మంచితనం గురించి చర్చించుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా తేజ్ 15 సినిమాను నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు సాయి. అందులో ఒకటి మేనమామ పవన్ కళ్యాణ్‌తో కూడా చెయ్యాల్సి ఉంది.

You may also like