Ads
మాస్ మహారాజా కెరీర్ ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు. ఏడాదికి మూడు-నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.
Video Advertisement
ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ, శరత్ మండవ దర్శకత్వంలో చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా కూడా మాస్ రాజా జోరు ఏ మాత్రం తగ్గకుండా మరింత వేగం అయ్యింది.ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.అయితే రవితేజ చేసిన వరుస సినిమాలు పరాజయం కావడంతో ఈ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాట మాస్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంది.ఇందులో రవితేజ అండ్ శ్రీలీల జంటగా కనిపించగా వీరి జంట ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ నెట్లో సందడి చేస్తోంది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ‘జబర్దస్త్’ స్కిట్స్ లాంటి కామెడీ ట్రాక్ లు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా దర్శకుడు త్రినాథరావు.. హైపర్ ఆది మంచి స్నేహితులు.
‘జబర్దస్త్’ షోలో హైపర్ ఆది స్కిట్స్ ఏ రేంజ్ లో పేలుతాయో తెలిసిందే. అందుకే త్రినాథరావు.. ఆదితో తన సినిమా కోసం కొన్ని స్కిట్స్ రాయించుకున్నారట. సినిమాలో అక్కడక్కడా జబర్దస్త్ స్కిట్స్ కనిపిస్తాయని అంటున్నారు. అయితే ‘జబర్దస్త్’ షోని ఎంత మంది ఇష్టపడతారో అదే రేంజ్ లో హేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. బుల్లితెరపై ఆ షో ఓకే కానీ.. అలాంటి స్కిట్స్ ను వెండితెరపై పాపులర్ హీరోలు వేస్తే బాగోదేమో. అసలు బేసిక్ గా రవి తేజ అంటేనే సూపర్ కామెడీ. ఈయన కోసం హైపర్ ఆది అవసరమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా హైపర్ ఆది స్కిట్స్ లో కొంచెం అసభ్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రవి తేజ వంటి స్టార్ హీరో ఎలా ఒప్పుకున్నాడన్నదే ప్రశ్న.
అయితే ఈ విషయంలో హీరో రవితేజ ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని టాక్. దర్శకుడు చెప్పినట్లుగా సినిమా చేసుకుంటూ వెళ్లిపోయారట. ఈ మధ్యకాలంలో రవితేజ జడ్జిమెంట్ చాలా వరకు ఫెయిల్ అవుతుంది. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదని.. దర్శకుడికే మొత్తం వదిలేశారని తెలుస్తోంది.మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
End of Article