Home Filmy Adda ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా కథలో కొత్త ట్విస్ట్..? ఆ సినిమా రిపీట్ అవ్వబోతోందా..?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా కథలో కొత్త ట్విస్ట్..? ఆ సినిమా రిపీట్ అవ్వబోతోందా..?

by Anudeep

ఆర్ఆర్ఆర్‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్‌డ‌మ్ సంపాదించాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ . తార‌క్ ఇప్ప‌టికే రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. వీటిలో ఒక‌టి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో చేయ‌బోతున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్టు. మ‌రోవైపు కొర‌టాల శివ‌తో చేయ‌నున్న సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంద‌నే దానిపై ఇప్ప‌టివ‌ర‌కు అప్‌డేట్ రాలేదు.

‘కేజీఎఫ్’తో దేశాన్ని షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ రెండు చిత్రాలు ప్యాన్ ఇండియా లెవల్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ‘ప్రభాస్’తో ‘సలార్’ తీస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ‘సలార్’ తర్వాత పట్టాలెక్కనుంది.

interesting update about NTR 31
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘కొరటాల శివ’ దర్శకత్వంలో మూవీకి కమిట్ అయ్యాడు. ‘ఆచార్క్ష్’ ఫ్లాప్ తో అప్పుల పాలైన కొరటాల ఆ సినిమా కోసం ఆస్తులు అమ్మి మరీ సెటిల్ చేసినట్టు టాక్. ఆ గొడవల్లో పడి ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం చేస్తున్నాడు.

interesting update about NTR 31
ఎన్టీఆర్ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఓ అద్భుతమైన న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఎన్టీఆర్ భారీ మీసాలతో బ్లాక్ అండ్ వైట్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నాడు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుముందే ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

interesting update about NTR 31
ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని, ఆ సినిమాలో హీరో ఆయనే విలన్ ఆయనే అని అంటున్నారు. గతంలో కూడా మన తెలుగు హీరోలు ఇలా భిన్న ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. జై లవకుశ అనే సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. కానీ సినిమా క్లైమాక్స్ లో ఆయన పాత్ర మంచిగా మారిపోతుంది.

అలాగే టెంపర్ లో కూడా ఆయన పాత్ర నెగిటివ్ షేడ్స్ తోనే ఉన్నట్లుగానే అనిపిస్తుంది, కానీ చివరికి హీరోగా మిగిలిపోతారు. ఈ ప్రయోగాలు ఎలాగో సక్సెస్ అయ్యాయి కాబట్టి ఎన్టీఆర్ మరోసారి ఆ మేరకు సిద్ధమవుతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.

interesting update about NTR 31
ఎన్టీఆర్‌ 31 ను ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ పై ప్రశాంత్‌ నీల్‌ ఫోటో షూట్‌ టెస్ట్‌ షూట్‌ నిర్వహించాడు. ఈ పోస్టర్ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా 32 కెమెరాలు ఉపయోగించాడని సమాచారం. అయితే సినిమా మొదలవడానికి కనీసం ఇంకా ఆరు నెలల సమయం ఉంది.

ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సలార్ మూవీతో బీజీగా ప్రశాంత్‌ నీల్‌… వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ మూవీ చేయనున్నారు.
ఈ సినిమాకు మంచి పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టె ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. ఆ టైటిల్ కూడా ‘అసుర’ లేక ‘అసురుడు’ అని వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.

You may also like