Ads
హీరో కావాలన్న తన చిరకాల వాంఛను ‘ది లెజెండ్’ సినిమాతో తీర్చుకున్నాడు శరవణ స్టోర్స్ అధినేత శరవణన్. ఐదు పదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు. ఈ ఒక్క సినిమాతో శరవణ స్టోర్స్ శరవణన్ కాస్త లెజెండ్ శరవణన్‌గా మారిపోయాడు.
Video Advertisement
రూ.60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ది లెజెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. శరవణన్‌కు భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నత నిర్మాణ విలువలతో లెజెండ్ మూవీ తెరకెక్కించారు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లెజెండ్ చిత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ లో పదో వంతు కూడా లెజెండ్ వసూలు చేయలేకపోయింది. లెజెండ్ ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ రూ. 17 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. వేల కోట్ల ఆస్తి కలిగిన అరుళ్ తన సొంత బ్యానర్ లో నిర్మించి విడుదల చేశారు.
ఇదిలా ఉంటె శరవణన్ మరో చిత్రాన్ని చేయనున్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ ట్రాకర్ రమేష్ బాల ట్వీట్ చేశారు. అరుళ్ కొత్త మూవీ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు ఆయన వెల్లడించాడు. రొమాంటిక్ డ్రామా జోనర్లో శరవణన్ తన రెండో సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో శరవణన్ చర్చలు జరిపాడని.. కథ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో శరవణన్ 11 మంది హీరోయిన్లతో ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదొక లవ్ స్టోరీ అని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇప్పడు ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం..
#1 పూజా హెగ్డే
#2 హన్సిక
#3 శ్రద్ధ శ్రీనాథ్
#4 యషిక ఆనంద్
#5 నుపుర్ సనన్
#6 తమన్నా
#7 ఊర్వశి రౌటేలా
#8 రాయ్ లక్ష్మి
#9 డింపుల్ హయాతి
#10 శ్రీ లీల
వీరు మాత్రమే కాకుండా మరొక స్టార్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు అని సమాచారం. కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియలేదు.
End of Article