Ads
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇది మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. గాడ్ ఫాదర్ ట్రైలర్ లో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీ నటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
Video Advertisement
అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్య దేవ్ కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా టీజర్ లో కనిపించారు. గాడ్ ఫాదర్ సినిమా తో పాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అయితే ఇది మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. మరి గాడ్ ఫాదర్ కి లూసిఫర్ కి మధ్య కొన్ని మార్పులు వున్నాయి. అవేమిటో చూద్దాం.
#1. గాడ్ ఫాదర్ లో హీరో విషయంలో జాగ్రత్త పడుతున్నారు. అందులోను మెగాస్టార్ సినిమా కనుక మరింత జాగ్రత్త పడుతున్నారు. ఫ్యాన్స్ ఎక్కడా నిరాశ పడకుండా ఉండాలి అని సినిమా బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
#2. సాధారణంగా చిరంజీవి సినిమా అంటే ఎక్కడో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అని ప్రేక్షకులు అనుకుంటారు. అందుకే గాడ్ ఫాదర్ లో కాస్త కమర్షియల్ ఎలెమెంట్స్ ని యాడ్ చేస్తున్నారు.
#3. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఎక్కువ ఉండేలా చూస్తున్నారు. పైగా ఈ సీన్లు మాస్ ప్రేక్షకులకి నచ్చే విధంగా చిత్రీకరించనున్నారు. ఈ రెండు సినిమాలకి పోల్చి చూస్తే లూసిఫర్ లో ఇలా లేదు.
#4. పైగా మన తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా మ్యూజిక్ ని కూడా అందిస్తున్నారు. మన నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే అందరికీ నచ్చుతుందని ఆ జాగ్రత్త కూడా తీసుకున్నారు. పైగా తమన్ కనుక బీజీఎమ్ బాగుండేలా చూస్తున్నాడు. అఖండలో కూడా తమన్ మంచి బీజీఎమ్ ఇచ్చాడు. ఇప్పుడు చిరు కనుక మళ్ళీ మంచిగానే బీజీఎమ్ ఇచ్చేలా కనపడుతున్నాడు. పెద్ద బాధ్యతే పడింది.
#5. మెగాస్టార్ సినిమా కావడంతో డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా ఉండేలా చూసుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే రాజకీయాలకు దూరం అయ్యాను అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ చాలా వైరల్ అయ్యింది. సినిమాలో ఇలాంటి డైలాగ్స్ చాలా ఉంటాయి అని సమాచారం. అలాగే పంచ్ డైలాగ్స్ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు.
ఇది ఇలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ కి మాత్రం పెద్దగా రెస్పాన్స్ కూడా రాలేదు. మలయాళం చిత్రం తో పోల్చి చూస్తున్నారు. మంచి కంటెంట్ వున్న లూసిఫర్ మూవీని మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మార్చేశారని అంటున్నారు ప్రేక్షకులు.
End of Article