Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. భీమ్లా నాయక్ తరువాత హరిహర వీరమల్లును స్పీడప్ చేయాలి అనుకున్నారు. కాని ఎంత కష్టపడుతున్నా.. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చేట్టు కనిపించడం లేదు.
Video Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో హరి హర వీరమల్లు సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలాకాలమే అవుతుంది. అయితే ముందుగా భీమ్లా నాయక్ కంప్లీట్ చేయాలని ఆ సినిమాపై ఎక్కువగా దృష్టి పెట్టాడు పవర్ స్టార్. ఇక కరోనా కారణంగా కొన్నాళ్లు .. పవన్ నిర్ణయాల కారణంగా కొన్నాళ్లు వీరమల్లు షూటింగు విషయంలో డిలే అవుతూ వచ్చింది. రీసెంట్ గా మళ్లీ ఈ సినిమా షూటింగు స్టార్ట్ అయ్యింది కాని.. అనుకున్నట్టుగా ముందుకు సాగడం లేదు.
ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, మిగతా 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోవల్సి ఉంది. అయితే హిస్టారికల్ సినిమా అవ్వడంతో బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఎక్కువగా ఉందట. ఈ సినిమా కోసం భారీ సెట్లను వేయించారు. కొన్ని గ్రౌండ్స్ ను కూడా రెడీ చేశారు. ఈ లొకేషన్లలో నాన్ స్టాప్ గా షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి.
అయితే ఇప్పటికే సినిమా ప్రారంభించి చాలా కాలం కావడంతో డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక చాలా మంది కీలక నటులు తప్పుకుంటున్నట్లు సమాచారం. ముందుగా జాక్వలిన్ ఫెర్నాండేజ్ తప్పుకోగా.. ఇప్పుడు నటుడు అర్జున్ రామ్ పాల్ కూడా తప్పుకుంటున్నారని సమాచారం.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ బస్సు యాత్ర ఏర్పాట్లు కూడా ముమ్మరం గా సాగుతున్న నేపథ్యం లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఈ సమయం లోనే దసరా కు ప్రారంభం అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఆలస్యం గా ప్రారంభించే అవకాశం ఉందంటూ జన సేన అధికారికం గా ప్రకటించింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ ఉన్న సినిమా లకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.నవంబర్ లేదా డిసెంబర్ నుండి జన సేన బస్సు యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఈ లోపు పవన్ కళ్యాణ్ సాధ్యమై నన్ని ఎక్కువ రోజులు షూటింగ్లో పాల్గొని సినిమాలను పూర్తి చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ఈ మధ్యనే హరిహర వీరమల్లు ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ జరిగింది. ఇప్పటికే వర్క్‌షాప్‌లో పవన్ కల్యాణ్, క్రిష్, కీరవాణి టీం వర్క్ షాప్‌లో పాల్గొన్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వీరితోపాటు వర్క్ షాప్ షెడ్యూల్‌లో జాయిన్ అయింది. దీని వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. పవన్ బస్సు యాత్ర స్టార్ట్ అయ్యేలోపు ఈ చిత్ర షూటింగ్ ముగించేందుకు క్రిష్ ట్రై చేస్తున్నారట.
అయితే ఈ వర్క్ షాప్ ఎదో ముందే చేసుంటే షూటింగ్ చాలా వరకు అయిపోయి ఉండేది కదా అని పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి
End of Article