Ads
ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి కేవలం టాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు పాజిటివ్ గా మాట్లాడుతూ, ఇప్పటికీ ఈ సినిమాపై తమ అభిమానాన్ని చాటుతున్నారు. అయితే భారత సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి నిరూపించిన రాజమౌళిపై ఇతర దేశంలోని ప్రేక్షకులు, సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తుంటే, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఓ హీరోయిన్ మాత్రం తన అక్కసును వెల్లగక్కింది.
Video Advertisement
పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాలో హీరోయిన్‌గా నటించిన నికిషా పటేల్, ఆ సినిమా ఫ్లాప్‌గా మిగలడంతో మళ్లీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్‌లోనూ ఒకట్రెండు సినిమాలు చేసినా, ఫలితం లేకపోవడంతో కేవలం సెలబ్రిటీ అనే మార్క్‌ను మాత్రమే మిగిల్చుకోగలిగింది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని.. అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ ఏమీ లేదంటూ నికిషా పటేల్ ఎద్దేవా చేసింది. అయితే చూసిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదంటూ తన కామెంట్స్‌ను వ్యక్త పరిచింది ఈ బ్యూటీ. ఇక నికిషా పటేల్ చేసిన కామెంట్స్‌కు ఆర్ఆర్ఆర్ అభిమానులతో పాటు రాజమౌళి ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. తనకు సినిమాల విషయంలో సరైన అవగాహన లేదు గనకే, ఆమె హీరోయిన్‌గా రాణించలేకపోయిందంటూ పలువురు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గతం లో మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టెయిట్ర్ లో ఆయన్ను విష్ చేసింది నికిషా. అయితే ఆ ట్వీట్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో తారక్ నటనకు ఫిదా ఇపోయా అన్నట్లు పోస్ట్ పెట్టింది. అలాగే తాజాగా అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చూసా.. నాకు నచ్చలేదు అని కామెంట్లు చేయడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే గతం లో ఆమె ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చూడకుండానే ఎన్టీఆర్ కి విషెస్ చెప్పారా అంటూ రెండు ట్వీట్ల స్క్రీన్ షాట్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు జనాలు.
ఇక హీరోయిన్ నికిషా పటేల్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్. జె సూర్యదర్శకత్వంలో 2010లో వచ్చిన ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం కొమరం పులితో నికిషా పటేల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ భామకు అవకాశాలు రాలేదు. ఇక చేసేదేం లేక ఇండస్ట్రీలో ఉండలేక వేరే దేశం వెళ్ళిపోయింది. నికిషా చివరి సారిగా తెలుగులో 2016లో వచ్చిన అరుకు రోడ్‌లో అనే సినిమాలో నటించింది. ఓ పక్క తెలుగులో నటిస్తూనే.. ఓ తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ అక్కడ కలిసిరాలేదు.
End of Article