Ads
చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.
Video Advertisement
దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం ఈ సినిమాకు హిట్ టాక్ వస్తోంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా అంత పెద్దగా ఆడట్లేదు అని అంటున్నారు.
ఈ సినిమా విడుదల అయ్యి మూడు రోజులు అయ్యింది. మూడవరోజు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్ల షేర్, రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.41 కోట్ల షేర్ రాబట్టింది అనే సమాచారం. దీంతో మూడు రోజులకి కలిపి ఈ సినిమా 34.36 కోట్ల షేర్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 26.11 కోట్ల షేర్ సాధించినట్లు చెప్తున్నారు. తెలంగాణలో దాదాపు రూ. 1.68 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.60 కోట్లు, రాయలసీమలో రూ. 1.13 కోట్ల షేర్ వసూలు చేసింది.
గాడ్ ఫాదర్ ప్రీ బిజినెస్ వాల్యు దాదాపు 91 కోట్ల రూపాయలు. కానీ ఇప్పటివరకు వచ్చిన వసూళ్లనే చూస్తే రికవర్ అయ్యింది కేవలం 37.75 శాతం మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70.5 కోట్లు ప్రీ బిజినెస్ వాల్యూ జరిగింది. కానీ ఇప్పటి వరకు వచ్చింది 37 శాతం మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12.97 కోట్లు, రెండవ రోజు రూ. 7.73 కోట్లు, మూడో రోజు రూ. 5.41 కోట్ల షేర్ వచ్చింది. దాంతో ఆదివారం వీకెండ్ కాబట్టి అప్పుడు బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఒకవేళ కాకపోతే మాత్రం ఈ లెక్కల ప్రకారం సినిమాకి కలెక్షన్ల పరంగా నష్టం వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతం అయితే సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా టేకింగ్ పరంగా, కంటెంట్ పరంగా చాలా బాగుంది అని అంటున్నారు. కానీ చిరంజీవి రేంజ్ హిట్ అయితే మాత్రం ఇది కాదు అని కొంత మంది అంటున్నారు. కొంత మంది మాత్రం చిరంజీవి ఇలాంటి డిఫరెంట్ పాత్ర చేయడం అనేది చాలా మంచి విషయం, ఇలాగే పాత్రల పరంగా కూడా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు.
End of Article