Home Filmy Adda అన్ని హిట్ సినిమాలు ఉండగా మళ్లీ “రెబెల్” సినిమానే దొరికిందా..? కారణం ఇదేనా..?

అన్ని హిట్ సినిమాలు ఉండగా మళ్లీ “రెబెల్” సినిమానే దొరికిందా..? కారణం ఇదేనా..?

by Anudeep

యూనివర్సల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఈస్టార్ హీరో కెరీర్ బిగినింగ్ లో టర్నింగ్ పాయింగ్ గా నిలిచిన సినిమాలను మరోసారి రిలీజ్ చేయబోతున్నారట. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాలను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ ఉన్నాయి. అలా హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటై ఓ స్పెషల్ ఇమేజ్ తో పాటు.. అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో వర్షం సినిమా ఒకటి. 2004 లో రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది సినిమా.

fans planning to re rease 3 films of prabhas on his birthday..
అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 22 మరియు 23 తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు టీమ్. మరి ఇప్పటికే తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను అందుకున్నాయి. మరి వర్షం సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి.

fans planning to re rease 3 films of prabhas on his birthday..
వర్షం చిత్రం తో పాటు.. రెబల్, బిల్లా సినిమాల్ని కూడా ఈనెలలో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు 3 సినిమాల్ని 4కే రిజల్యూషన్ లోకి మార్చే పనులు ఊపందుకున్నాయి. త్వరలోనే ఈ 3 సినిమాల విడుదలకు సంబంధించి థియేటర్స్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే.. వర్షం, బిల్లా చిత్రాలు సూపర్ హిట్ లు అని మనకు తెలిసిందే.. కానీ రెబెల్ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ చిత్రాన్ని ఇప్పుడెందుకు రిలీజ్ చేస్తున్నారు అంటూ ప్రభాస్ ఫాన్స్ చర్చించుకుంటున్నారు.

fans planning to re rease 3 films of prabhas on his birthday..
రాఘవ లారెన్స్ దర్శకత్వం లో వచ్చిన ‘రెబెల్’ చిత్రం అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అప్పుడే ఈ చిత్రాన్ని ఎవరు చూడలేదు.. మరి మళ్ళీ రీ రిలీజ్ ఎందుకు అని కొందరు ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అన్ని హిట్ సినిమాలు ఉండగా ఈ సినిమానే దొరికిందా అని వారు చర్చించుకుంటున్నారు.

fans planning to re rease 3 films of prabhas on his birthday..
మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన పెద్ద నాన్న కృష్ణం రాజు తండ్రిగా నటించారు. ఇటీవల ఆయన మరణించిన నేపథ్యం లో ఈ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు అని సమాచారం. ఈ కారణం తోనే వర్షం, బిల్లా చిత్రాలతో పాటు రెబెల్ కూడా రీ రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. శ్రీ బాలాజీ సినీ మీడియా వారు అక్టోబర్ 15వ తేదీన ”రెబల్” చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

fans planning to re rease 3 films of prabhas on his birthday..
సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా.. ఇందులో స్టైలిష్ అండ్ రెబెల్ గా ప్రభాస్ మాస్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. ‘రెబల్’ చిత్రం నెగటివ్ టాక్ ని మూటగట్టుకోగా మూవీలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. దీక్ష సేథ్ మరో హీరోయిన్ గా నటించింది.

You may also like