Home Filmy Adda “గురూజీలో ఈ యాంగిల్ కూడా ఉంది అని చూపించిన సినిమా..!” అంటూ… “అరవింద సమేత వీర రాఘవ” విడుదలయ్యి 4 ఏళ్ళు అవ్వడంపై 15 మీమ్స్..!

“గురూజీలో ఈ యాంగిల్ కూడా ఉంది అని చూపించిన సినిమా..!” అంటూ… “అరవింద సమేత వీర రాఘవ” విడుదలయ్యి 4 ఏళ్ళు అవ్వడంపై 15 మీమ్స్..!

by Anudeep

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘అరవింద సమేత’. పూజా హెగ్డే హీరోయిన్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు చాలా ఏళ్లు సమయం తీసుకుని ఎన్టీఆర్ కోసం కసితో తన శైలికి భిన్నంగా ‘అరవింద సమేత’ కథను తయారు చేశారు త్రివిక్రమ్. తన సినిమాల్లో రక్తపాతం, హింసలకు దూరంగా ఉండే త్రివిక్రమ్ ‘అరవింద సమేత’లో రక్తపుటేరులు పారించారు.

aravind sametha veera raghava completes 4 years..
ఎన్నో ఏళ్ల నుండి నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ కాంబోలో భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. దీనికి తోడు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్‌తో చేస్తుండటం ఒక విశేషమైతే.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ‘ఆది’ సినిమాలో ఆదికేశవరెడ్డిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ఆ తరహా పాత్రలో చాలా ఏళ్ల తరువాత కనిపిస్తున్నారు. వీరరాఘవుడిగా సిక్స్ ప్యాక్‌లో దర్శనం ఇచ్చి ఫస్ట్‌లుక్‌తో సర్ ప్రైజ్ చేశాడు ఎన్టీఆర్.

ప్రతి నాయకుడిగా జగపతి బాబు, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నాగబాబు కీలకపాత్రల్లో నటించారు. పీఎస్ వినూద్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్, రామ్ లక్ష్మణ్ స్టంట్స్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు సమకూర్చిన మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ (చినబాబు) నిర్మించారు. 2018 అక్టోబర్ 11న దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు అయిన సందర్భంగా కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి ..

#1

aravind sametha veera raghava completes 4 years..
#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

You may also like