Home Filmy Adda “చెప్పేది ఒకటి చేసేది ఒకటి..!” అంటూ… రష్మిక పై నెటిజన్స్ ఫైర్..!

“చెప్పేది ఒకటి చేసేది ఒకటి..!” అంటూ… రష్మిక పై నెటిజన్స్ ఫైర్..!

by Anudeep

కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఇక ఆ తర్వాత విజయ్‌తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేశారు. తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు.

 

పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రం తో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ సినిమా తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది రష్మిక.

netizens trolls on rashmika mc donalds ad..
ఇలా ఉండగా ..ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్‌కి స్టార్ నటి రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అనేక మెక్‌డొనాల్డ్స్ ప్రకటన ప్రకటనలలో రష్మిక మనకు కనిపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ పేరుతో ఆ సంస్థ భోజనం ప్రవేశ పెట్టింది.

netizens trolls on rashmika mc donalds ad..
రష్మిక మెక్‌డొనాల్డ్స్ మెనూలో ఇంక్లూడ్ చేసిన ‘ది రష్మికా మీల్’ని ప్రకటించింది. ఈ భోజనానికి సంబంధించిన ప్రోమో వీడియోను కూడా రష్మిక షేర్ చేసింది.  ఈ భోజనంలో మెక్‌స్పైసీ ఫ్రైడ్ చికెన్, పెరి-పెరి ఫ్రైస్ ఉంటాయి.ఒక మెక్‌స్పైసీ చికెన్ బర్గర్, నింబు ఫిజ్ మరియు మెక్‌ఫ్లరీ. రష్మిక మీల్ ఇప్పుడు భారతదేశంలోని అన్ని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లలో అందుబాటులో ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

netizens trolls on rashmika mc donalds ad..
అయితే రష్మిక గతం లో తాను జంక్ ఫుడ్ కు దూరం గా ఉంటానని..బర్గర్ వంటి వాటిని ఎప్పుడో ఒకసారి తింటాను.. ఆరోగ్యమైన ఆహారాన్నే తినేందుకు నేను ఇష్టపడతాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. అప్పుడు అలా చెప్పి ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ యాడ్ లో నటించడం తో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రష్మిక చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

netizens trolls on rashmika mc donalds ad..
మరో వైపు పుష్ప సూపర్ హిట్ కావడం తో రష్మిక హిందీ సినిమాల్లో కూడా బిజీ అవుతోంది. తాజాగా అమితాబ్ తో ఆమె నటించిన ‘గుడ్ బై’ చిత్రం విడుదల అయ్యింది. ప్రస్తుతం రష్మిక చేతిలో మిషన్ మజ్ను, యానిమల్ సినిమాలు ఉన్నాయి.ఇక తెలుగులో పుష్ప 2లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు వంశీ పైడిపల్లి, విజయ్ థలపతి కాంబినేషన్‌లో వస్తున్న వారసుడులో నటిస్తుంది. వీటితో పాటు రష్మిక ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలోను అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని హిందీ సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయని సమాచారం.

You may also like