Ads
ఇది వరకు కంటే ఇప్పుడు సినిమాల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఒరిజినల్ గా కాకుండా సినిమాలని ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా రీమేక్ చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్లో మంచి సక్సెస్ వచ్చిన పింక్ మూవీని వకీల్ సాబ్ కింద తెలుగులోకి తీశారు.
Video Advertisement
అలానే అయ్యప్పన్ కోషియన్ సినిమాని భీమ్లా నాయక్ కింద రీమేక్ చేశారు. గాడ్ ఫాదర్ కూడా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. భోళా శంకర్ కూడా రీమేక్ చిత్రమే.
ఇలా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రీమేక్ చిత్రాలు ఎక్కువై పోయాయి. అయితే ఈ విషయంపై పెద్దగానే చర్చ జరుగుతోంది. అందరూ రీమేక్స్ మీదే ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇదే జరుగుతోంది. వేరే ఇండస్ట్రీల విషయానికి వస్తే.. మలయాళం, తమిళం, కన్నడ చిత్రాలని చూస్తే చక్కటి కథలతో సినిమాలు తీస్తున్నారు. తమిళ్ లో సూర్య చాలా పెద్ద స్టార్ హీరో. అలాంటి సూర్య కూడా జై భీమ్ లాంటి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో సూర్య పాత్ర హీరో పాత్ర లాగా ఏమీ ఉండదు. కథను ముందుకు నడిపించే ఒక పాత్ర అంతే.
హీరోయిజం చూపించడం, ఫైటింగ్ చేయడంలాంటిది ఏమీ ఉండదు. ఒక అమ్మాయి తన భర్త కోసం చేసే పోరాటంలో సహాయపడే పాత్రలో సూర్య కనిపించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు సంపాదించింది. అంతే కాకుండా సూర్య ఈ సినిమాని నిర్మించారు కూడా. దాంతో ఇలాంటి సినిమాలో నటించడం మాత్రమే కాకుండా ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు కూడా సూర్యని చాలామంది ప్రశంసించారు.
వాటిలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వారి యొక్క ఇమేజ్ ని పక్కన పెట్టేసి కథ బాగుంటే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం మంచి కథని కూడా కమర్షియల్ చేస్తున్నారు. నిజానికి మన దగ్గర డైరెక్టర్లు లేక కాదు. కానీ ప్రతి సారీ రీమేక్ చిత్రాలు మీద ఆధార పడి సినిమాలు చేయాల్సి వస్తోంది. పైగా రీమేక్ కూడా ఉన్నది ఉన్నట్లు కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నారు. ఆ సినిమా తాలూకా ఒరిజినల్ ఇండస్ట్రీ వాళ్ళు వాటిని చూసి తిడుతున్నారు.
ఎక్కువగా రీమేక్ సినిమాలు చేయడం కేవలం మన ఇండస్ట్రీలో మాత్రమే అవుతుందేమో అని అంటున్నారు. అంతకుముందు రీమేక్ సినిమా అంటే, “సరే తెలుగులో ఎలా తీస్తారో?” అనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం, “అబ్బా మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నారా? కచ్చితంగా కథ అంతా మారుస్తారు. సినిమా ఎలా తీస్తారో?” అని భయపడుతున్నారు. అనుకున్నట్టుగానే తర్వాత సినిమా ట్రైలర్ కానీ, పోస్టర్ కానీ విడుదల అయితే చాలామంది ట్రోల్ చేస్తున్నారు.
ఏదో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల పెద్ద హీరో సినిమా విడుదల అయితే ఒకవేళ అది రీమేక్ అయితే కథ ఎలా మార్చినా కూడా ప్రేక్షకులు చూసి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కానీ కొన్ని రోజులు మాత్రమే ఇది జరుగుతుంది. తర్వాత ప్రతి రీమేక్ సినిమా కూడా దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. బాలీవుడ్ మీద జనాలకి మంచి అభిప్రాయం వచ్చి చాలా రోజులు అయ్యింది. గత కొంత కాలం నుండి వారు చేసే సినిమాలు చాలా తక్కువగా హిట్ అవుతున్నాయి.
కానీ సౌత్ ఇండస్ట్రీ అంటే గత కొంత కాలం నుండి అందరికీ మంచి సినిమాలు తీస్తున్నారు అనే ఒక ఆలోచన ఉంది. తెలుగులో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. కానీ రీమేక్ సినిమాల వైపు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. దీంతో చాలామంది నెటిజన్లు, “కేవలం తెలుగులో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది? అంత మంది డైరెక్టర్లు ఉన్నారు కదా? ఒక మంచి ఒరిజినల్ సినిమా తీయొచ్చు కదా? బలమైన కథ ఉన్న సినిమాలు కావాలి అంటే రీమేక్ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది?” అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article