Ads
దసరా పండుగ తర్వాత ప్రతి సంవత్సరం బీజేపీ బడా నేత దత్తాత్రేయ అలయ్ బలయ్ అనే వేడుకను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఈ అలయ్ బలయ్ ఈవెంట్‌లో జరిగిన ఓ వివాదం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
Video Advertisement
అలయ్ బలయ్ వేడుకలో గరికపాటికి , చిరంజీవికి మధ్య మొదలైన చిన్న వివాదం రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ తో మరో మలుపు తీసుకునేలా ఉంది. ఆ వేడుకలో ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు అండ్ చిరంజీవికి మధ్య చిన్న క్లాష్ జరిగింది. గరికపాటి ఆవేశపడినా, చిరంజీవి సమయస్ఫూర్తి కారణంగా ఆ వివాదం పెద్దది కాలేదు. ఈ నేపథ్యం లో మెగా అభిమానులు గరికపాటి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే ఆ ఇష్యూలోకి ఎప్పుడైతే ఆర్జీవీ ఎంటర్ అయ్యాడో సోషల్ మీడియాలో రోజూ రచ్చ రచ్చ అవుతోంది.. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చిరంజీవికి మద్దతు పలుకుతూ ప్రవచనాలు చెప్పే అంత జ్ఞానం ఉన్న గరికపాటి చిరంజీవితో అలా ప్రవర్తించటం ఏమాత్రం బాగోలేదని, కచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాలని అన్నారు.
ఈ క్రమంలోనే వర్మ.. గరికపాటి పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. చిరంజీవిని ఏనుగుతో పోలుస్తూ.. గరికపాటిని గడ్డిపరకతో పోల్చి ట్వీట్ చేసిన వర్మ.. తాజాగా మరో సారి తన నోటికి పని చెప్పాడు. ఈసారి ఏకంగా గరికపాటి అనుష్కను కొంటెగా పొగిడే వీడియోను పోస్ట్ చేసి.. మరో వివాదానికి తెరలేపాడు.
ఎప్పటిదో గరికపాటి పాత వీడియోని తిరిగి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ గరికపాటికి స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.
చాలా కాలం క్రితం గరికపాటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క అందం గురించి చెప్పుకొచ్చారు. తన కొడుకు ఒకరోజు మ్యాగజైన్ పైన ఉన్న అనుష్క అందాన్ని చూస్తూ ఉండిపోయాడని, “ఆమెను చూసి నేనే ఆకర్షతుడిని అవుతున్నాను తను అవడంలో తప్పులేదు అనిపించింది,” అని గరికపాటి అన్నారు. ఆ వీడియోని పోస్ట్ చేస్తూ రాంగోపాల్ వర్మ “ఓహో.. ఆహా.. అడ్డెడ్డే” అనే క్యాప్షన్ తో ఈ వీడియోని షేర్ చేశారు రాంగోపాల్ వర్మ. చిరంజీవిని అన్నందుకు అభిమానుల కంటే ఎక్కువగానే వర్మ ఫీల్ అవుతున్నారని మరికొందరు చెబుతున్నారు.
ప్రస్తుతం వర్మ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక తనపై ఎన్ని విమర్శలు వస్తున్నాగానీ గరికపాటి ఇంత వరకు స్పందించలేదు.
watch video :
OHO ! AAHAA! ADDDDADDDDDADDDADDE 😍😍😍 pic.twitter.com/aRGFu4i02H
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022
End of Article