Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. అవి చాలా వైరల్ అయ్యాయి.
ఇవన్నీ మాత్రమే కాకుండా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఒక హారర్ కామెడీ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయినట్టు సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు అని సమాచారం. అలా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అన్నమాట. ఈ సినిమాపై సినిమాకి సంబంధించి ఒక్కరు కూడా మాట్లాడలేదు.
మరి ఇలా సైలెంట్ గా వచ్చి హిట్ కొడతారేమో అని చాలామంది అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన విషయంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే సినిమా బృందం ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.
End of Article