Ads
చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.
Video Advertisement
కానీ గాడ్ ఫాదర్ ఫ్యాన్స్ ని మాత్రం నిరాశ పరచలేదని చెప్పాలి. దీని ముందు వచ్చిన ఆచార్య సినిమా మాత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. అయితే ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. అందుకు ముఖ్య కారణం చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడం.
ఈ సినిమా విడుదల అయిన తర్వాత చిరంజీవి కూడా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడలేదు. ఇటీవల చిరంజీవి ఈ సినిమాపై స్పందించారు. చిరంజీవి మాట్లాడుతూ, “ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సినిమా నిర్మాతలకి నేను, రామ్ చరణ్ 80% రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశాం. సినిమా ఫెయిల్ అయినప్పుడు దాని పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సినిమా చేసినందుకు నాకు గిల్టీ గా ఏమీ లేదు” అని అన్నారు.
End of Article