Home Filmy Adda అఖిల్ అక్కినేని “ఏజెంట్” విలన్ పోస్టర్ లో… ముసుగులో ఉన్న నటుడు ఇతనేనా..?

అఖిల్ అక్కినేని “ఏజెంట్” విలన్ పోస్టర్ లో… ముసుగులో ఉన్న నటుడు ఇతనేనా..?

by Anudeep

ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్క హిట్ సినిమా కూడా లేని అక్కినేని అఖిల్.. గతేడాది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించలేకపోయాడు. తాజాగా ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని పట్టుదలగా ఉన్న అఖిల్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు.

 

సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అఖిల్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది.

who is the actor in agent movie villan poster..??
ఈ సినిమాలోని విలన్ ఫోటోను రిలీజ్ చేస్తూ.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలోనే రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఫోటోలో విలన్‌ మొహం కనిపించకుండా.. ఒళ్ళంతా దుస్తులు ధరించి, చేతిలో గన్‌ పట్టుకుని తీవ్రవాదిలా ఉన్నాడు. ఈ ఫోటో తో విలన్‌ ఎవరా అనే ఆసక్తి ని క్రియేట్‌ చేశారు మేకర్స్.

who is the actor in agent movie villan poster..??
అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించేది హిందీ చిత్ర నటుడు నవాబ్ షా అని కొందరు అంటుండగా.. అక్కినేని ఫాన్స్ మాత్రం అఖిల్ ఏ విలన్ అని అంటున్నారు. దీంతో ఈ చిత్రం లో అఖిల్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారా అని ఫిలిం వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఒక స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

who is the actor in agent movie villan poster..??
మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.

You may also like