“దసరా” సినిమా స్టోరీ ఇదేనా..? ఈసారి నానికి బ్లాక్‌బస్టర్ పడినట్టే..!

“దసరా” సినిమా స్టోరీ ఇదేనా..? ఈసారి నానికి బ్లాక్‌బస్టర్ పడినట్టే..!

by Anudeep

Ads

వైవిధ్యమైన కథల ఎంపిక, తనదైన నటనతో అభిమానులను సంపాదించికున్నాడు న్యాచురల్ స్టార్ నాని. శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ తరువాత నాని నుంచి అంటే.. సుందరానికి సినిమా వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి స్పందన వస్తుంది.

Video Advertisement

ప్రస్తుతం నాని ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. అదే.. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న దసరా. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని ఊరమాస్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాపై నాని చాలా ఆశలే పెట్టుకున్నారు.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉందట. రెగ్యులర్ గా సినిమాల్లో కనిపించే రాజు, పేద టైప్ లవ్ స్టోరీనే ‘దసరా’లో కూడా చూపించబోతున్నారంట. కథ ప్రకారం.. సినిమాలో హీరోయిన్ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. హీరో మాత్రం స్లమ్ లో పుట్టి పెరిగినవాడు.

వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే అంశాలను దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చిత్రిస్తున్నాడంట. కావాలని ఇరికించినట్లుగా కాకుండా.. కథతో పాటు ట్రావెల్ అయ్యే లవ్ స్టోరీ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


End of Article

You may also like