అతిగా ఆలోచిస్తే ఈ 7 సమస్యలు వస్తాయట.. అందుకే సమస్య కలిగితే ఇలా చెయ్యాలి..!

అతిగా ఆలోచిస్తే ఈ 7 సమస్యలు వస్తాయట.. అందుకే సమస్య కలిగితే ఇలా చెయ్యాలి..!

by Megha Varna

Ads

అతిగా ఆలోచించి ఎంతగానో బుర్ర పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజానికి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకే నష్టం. ఎలా అయితే మనం పనులు చేసి అలసిపోతూ ఉంటామో.. అలానే ఆలోచించి ఆలోచించి మన మెదడు కూడా అలసిపోతుంది.

Video Advertisement

పైగా మానసికంగా మెదడు రిలీఫ్ ని పొందడానికి మార్గాలు కూడా తక్కువ. శారీరకంగా అలసిపోతే కాసేపు నిద్ర పోతే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆలోచనలతో ఎక్కువ సేపు కూర్చుంటే మెదడుకు విశ్రాంతి ఉండదు. అతిగా ఆలోచించడం వల్ల కొన్ని నష్టాలు కూడా కలుగుతాయట.

ఎక్కువగా ఆలోచించడం వల్ల కలిగే నష్టాలు:

#1. ఎక్కువ గా ఆలోచించడం వల్ల ఇప్పుడు జరిగిపోతున్న కాలాన్ని సరిగ్గా అనుభవించలేము.
#2. ఇప్పుడు వచ్చే అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేము.
#3. పైగా ఎక్కువ ఆలోచిస్తే మనం చేసే పని మీద ధ్యాస కూడా పెట్టలేము.
#4. అతిగా ఆలోచించడం వలన ఒంటరితనం అనుభవించాల్సి ఉంటుంది.

#5. మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కూడా మనం మాట్లాడలేదు.
#6. ఇది మన తిండి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సరిగ్గా ఆకలి ఉండదు సరిగ్గా ఏమీ తినాలని అనిపించదు.
పైగా ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది.
#7. ఇలా అతిగా ఆలోచిస్తే ఇన్ని కష్టాలు మనకి కలుగుతాయి.

అతిగా ఆలోచించకుండా సమస్యలను ఇలా పరిష్కరించుకోండి:

#1. ఎక్కువగా దేన్నీ ఆలోచించకండి. వీలైనంతవరకూ ఆలోచనలను తగ్గిస్తూ ఉండండి.
#2. సమస్య ఉన్నప్పటికీ మీరు దానిని పక్కన పెట్టి మిగిలిన పనులు కూడా చేసుకుంటూ ఉండండి. అప్పుడు మెదడు రిలాక్స్ అవుతుంది తర్వాత స్వయంగా మీరే సమస్యలు పరిష్కరించుకోవడానికి అవుతుంది.
#3. ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు కూడా బాగా వస్తాయి. అలానే మీరు మీ పని మీద ధ్యాస పెట్టి చక్కగా పనులు పూర్తి చేసుకోవడానికి కూడా అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఆలోచించకండి. ఇబ్బందులు పడకండి.


End of Article

You may also like