Home Filmy Adda ఈ సెంటిమెంట్ ప్రకారం “పుష్ప-2” బ్లాక్ బస్టర్ పక్కా..! ఇంత పెద్ద ప్లాన్ వేశారా..?

ఈ సెంటిమెంట్ ప్రకారం “పుష్ప-2” బ్లాక్ బస్టర్ పక్కా..! ఇంత పెద్ద ప్లాన్ వేశారా..?

by Anudeep

“పుష్ప: ది రైజ్” సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి పోస్టర్ డిజైన్ కోసం షూటింగ్ జరుగుతుండటం గమనార్హం. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన అవినాష్ గోవరికర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనార్హం.

is allu arjun following that sentiment for pushpa 2..??
అయితే పుష్ప ది రైజ్ మూవీ కూడా ఇదే విధంగా ఫోటోషూట్ తో మొదలైంది. ఆ సెంటిమెంట్ ను బట్టి పుష్ప ది రూల్ మూవీ విషయంలో కూడా బన్నీ ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. అందువల్ల ఈ సినిమా కూడా అంచనాలను మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప2 మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే బన్నీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

is allu arjun following that sentiment for pushpa 2..??
దాదాపుగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప: ది రైజ్ గత డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు పుష్ప 2కి కూడా సుకుమార్, బన్నీ ‘డిసెంబర్’ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ పుష్ప 2ని డిసెంబర్ 2023 లో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

is allu arjun following that sentiment for pushpa 2..??
మరో వైపు దర్శకుడు సుకుమార్‌ సమంత ని తనకు లక్కీ చార్మ్ గా భావిస్తున్నారట. `రంగస్థలం`లో ఆమె హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్‌ చేశారు. దర్శకుడిగా ఆ చిత్రంతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఆ తర్వాత తీసిన `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ రూపంలో సమంతని పెట్టి ఆ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేశాడు. దీంతో సమంత తనకు లక్కీ ఛార్మ్ గా మారిందని భావిస్తున్నారట. దీంతోమరోసారి ఆమెని రిపీట్‌ చేయాలనుకుంటున్నారట. కాకపోతే ఆమెతో ఐటెమ్‌ సాంగ్‌ చేయిస్తాడా? లేక మరేదైనా కీ రోల్‌ చేయిస్తాడా? అనేది సస్పెన్స్ గా ఉంది.

You may also like