Home Filmy Adda తలకిందులుగా వేలాడుతున్న… ఈ “స్టార్ నటుడు” ఎవరో గుర్తుపట్టారా..?

తలకిందులుగా వేలాడుతున్న… ఈ “స్టార్ నటుడు” ఎవరో గుర్తుపట్టారా..?

by Anudeep

లెజెండరి నటుడు జగపతి బాబుకు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌ హీరోలకు విలన్‌గా నటిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. హీరోగా జగపతి బాబుకు వచ్చిన క్రేజ్ కంటే.. విలన్‌గా వచ్చిన ఫాలోయింగే ఎక్కువగా ఉంటుంది. హీరోగా ఉన్నప్పుడు సంపాదించిన దాని కంటే విలన్‌గా ఉన్నప్పుడే ఎక్కువ సంపాదించాను అని జగపతి బాబు సెటైర్లు వేస్తుంటాడు.

‘మావిడాకులు, శుభలగ్నం, సర్దుకుపోదాం రండి, ఫ్యామిలీ సర్కస్‌’ వంటి కుటుంబ కథా చిత్రాలతో జగపతి బాబు ఎంతో గుర్తింపు పొందారు. లెజెండ్ సినిమాతో తన కొత్త కోణాన్ని చూపించిన జగపతి బాబు.. స్టైలిష్ విలన్‌గా ఇంకా దూసుకుపోతున్నాడు.

jagapathi babu funny post..
సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకే రకమైన పాత్రలు వేస్తున్నాడు అనే గుర్తింపును పోగొట్టేలా విభిన్న పాత్రలు ఎంచుకుంటున్నారు ఈ ఫామిలీ మాన్. రంగస్థలం, అరవింద సమేత సినిమాలతో జగపతి బాబు అందరినీ మెప్పించాడు. విలనిజంలో కొత్త చాప్టర్‌ను అందరికీ పరిచయం చేసినట్టు అయింది. విలన్ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు జగపతి బాబు.

jagapathi babu funny post..
ఇప్పుడు జగపతి బాబు సలార్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. అంతే కాకుండా హిందీలో ఒక సల్మాన్ ఖాన్ చిత్రం లో కూడా నటిస్తున్నాడు జగ్గు భాయ్. జగపతి బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తుంటాడు. కొటేషన్లు షేర్ చేస్తుంటాడు. వేదాంతం వల్లిస్తుంటాడు. తాజాగా జగపతి బాబు ఓ ఫోటోను షేర్ చేశాడు. దాంతో పాటు ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

jagapathi babu funny post..
ఒక వర్క్ అవుట్ చేస్తూ తలకిందులుగా వేలాడుతున్న జగపతి బాబు ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో తాను రాసిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచాన్ని ఇలా చూస్తే అయినా అర్థమవుతుందేమో? అని ఇలా ట్రై చేస్తున్నాను అని రాసుకొచ్చాడు జగపతి బాబు. మొత్తానికి జగపతి బాబు మాత్రం ఇప్పుడు తెలుగు లోనే కాకుండా కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఫుల్ బిజీగా మారిపోయాడు.

You may also like