అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో”… ఆ సినిమా కి “రీమేక్ ” అయితే కాదు కదా..?

అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో”… ఆ సినిమా కి “రీమేక్ ” అయితే కాదు కదా..?

by Anudeep

Ads

మెగా హీరో అల్లు శిరీష్ ఇటీవల సినిమాల సంఖ్యను చాలా తగ్గించాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యి మూడేళ్లు అవుతోంది. ఆ తరువాత శిరీష్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఆయన నటించిన రీసెంట్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుండటమే. దీంతో, తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ అల్లు వారి హీరో.

Video Advertisement

 

ఇక అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు రాకేశ్ శశి డైరెక్షన్‌లో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీకి గతంలో ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. తర్వాత ఈ సినిమా టైటిల్‌ను మార్చేస్తూ.. ‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

allu sirish new movie is the remake of that tamil movie..??
ఈ సినిమాతో అందాల భామ అను ఇమ్మాన్యుయెల్ కూడా తిరిగి సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ సినిమాపై అమ్మడు భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసారు.

అయితే టీజర్ ను చూసిన తర్వాత ఈ సినిమా తమిళ్ లో వచ్చిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ లా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 2018 లో ఎలాన్ దర్శకత్వం లో వచ్చింది ఈ చిత్రం. అయితే ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం ఆ తమిళ్ సినిమాకి రీమేక్ ఆ అని కొందరు సందేహ పడుతున్నారు. సినిమా విడుదల అయితే కానీ దీనిపై స్పష్టత రాదు.

allu sirish new movie is the remake of that tamil movie..??

 

ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. పూర్తి యూత్‌ఫుల్ సబ్జెక్టుగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేస్తుండగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు.


End of Article

You may also like