Ads
ఈ దీపావళికి పలు సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు అదిరిపోతే కొన్ని సినిమాలకి మాత్రం నిరాశే మిగిలింది. ఇంతకీ ఈ దీపావళికి విడుదలైన చిత్రాలేవి..?, ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఎంత వసూల్ చేసాయి అనేది చూద్దాం.
Video Advertisement
#1. జిన్నా:
మంచు విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించారు.
మంచు విష్ణు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఇచ్చారు. ఈ సినిమా విడుదల అయ్యింది. మంచి టాక్ ఈ సినిమాకు వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా లేవు. తొలిరోజు రూ.12 లక్షల షేర్ వసూలు అవ్వగా.. సెకండ్ డే రూ.10 లక్షలు, నెక్స్ట్ డే 8 లక్షలు, ఫోర్త్ డే అయితే 11 లక్షల షేర్ వసూలైంది. ఇలా నాలుగు రోజుల్లో రూ.41 లక్షల షేర్ రాగా… గ్రాస్ రూ.75 లక్షలుగా ఉంది.
#2. కాంతారా:
‘కాంతార’.. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న కన్నడ చిత్రం. భాష తో సంబంధం లేకుండా ప్రతి చోటా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది చిత్రం. హీరో గా.. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన అద్భుతానికి అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. మరుగున పడిపోతున్న కళలకి దృశ్యరూపం ఇచ్చిన రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కన్నడ వెర్షన్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేసింది. పదవ రోజున మాత్రమే రూ.1.30 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా.
#3. సర్దార్:
దర్శకుడు చక్కటి కథను ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో అన్ని కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చేసారు. ఈ సినిమా బిగినింగ్ కూడా చాలా బాగుంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే అదిరిపోతోంది. చాలా సీన్స్ ప్రేక్షకులని ఇంప్రెస్ చేసేలా వున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ.4.80 కోట్ల షేర్ వసూల్ చేసేసింది ఈ మూవీ. గ్రాస్ రూ.8 కోట్లు.
#4. ఓరి దేవుడా:
ఓరి దేవుడా హీరో విశ్వక్ సేన్. ఈ సినిమాకి పెద్దగా వసూళ్లు రాలేదు. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.3.20 కోట్ల షేర్ వచ్చింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ వచ్చేసి రూ.6 కోట్లుగా వుంది.
#5. ప్రిన్స్:
ప్రిన్స్ హీరో శివకార్తికేయన్. నాలుగు రోజుల్లో రూ.2.37 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా కనుక బ్రేక్ ఈవెన్‌ను చేరాలంటే రూ.4.63 కోట్ల షేర్ వసూలు చెయ్యాలి లేదంటే ఇబ్బందే.
End of Article