Home fact check మెగా కోడలు “ఉపాసన” వాడే ఈ “బాగ్” ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మెగా కోడలు “ఉపాసన” వాడే ఈ “బాగ్” ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

by Anudeep

టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు జపాన్‌లో బిజీ బిజీగా ఉన్నారు. అందుకు కారణాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్‌లో రిలీజైంది. దీంతో ఆ చిత్ర బృందం అక్కడ ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

దీని కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ ఫామిలీస్ తో కలిసి వెళ్లారు. అక్కడి ప్రఖ్యాతి గాంచిన ప్రదేశాలను వారు సందర్శిస్తున్నారు. ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా లో అప్ లోడ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

shocking price of upasana sling bag in japan tour..
అయితే తాజాగా ఉపాసన ధరించిన ఒక బాగ్ పై అందరి ద్రుష్టి పడింది. ఉపాస‌న విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త మాత్ర‌మే కాదు.. ఫ్యాష‌న్ ఐకాన్ కూడా. హై-ఎండ్ బ్రాండ్ ల పై ఆమెకున్న ప్రేమ చాలా స్ప‌ష్టంగా ఆమె తెలుపుతుంటోంది. ఉపాసన లివింగ్ స్టైల్ చూడ్డానికి సింపుల్‌గానే ఉంటుంది కానీ దానికోసం ఆమె చాలా ఖర్చు చేస్తారట.

shocking price of upasana sling bag in japan tour..
దానికి ఎగ్జాంపుల్ ఉపాసన ధరించిన ఆ బాగ్. చానెల్ కంపెనీ కి చెందిన స్లింగ్ బ్యాగ్ తో ఉపాసన అందరిని ఆకర్షించారు . దాని ధర అక్షరాలా 3,83,586 రూపాయలు. దీంతో దీని ధర చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంత సింపుల్ గా ఉన్న బాగ్ ఖరీదు అంతా.. అని ఆశ్చర్యపోతున్నారు.

You may also like