Ads
మనం మంచి చేస్తే అదే మంచి మనకి తిరిగి వస్తుంది.అదే చెడు చేస్తే అదే చెడు ఏదో ఒకరూపంలో వస్తుంది అని మనం వింటూనే ఉంటాం.అయితే సరిగ్గా పైన చెప్పిన వ్యాఖ్యానికి సంభందించిన కథ ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
అయితే ఒక దేశంలో ఓ రాజుకు మూడు కన్నులు ఉన్న కూతురు జన్మిస్తుంది.అయితే ఆ కూతురు జన్మించడం వలన రాజుకి నష్టమని ఆ అమ్మాయికి వివాహం చేసి పంపించేదాకా రాజుకి గండం తప్పదని జ్యోతిష్య పండితులు చెప్తారు.
అయితే కొన్నాళ్లకు రాజు కూతురు యుక్త వయసుకు వస్తుంది.దీంతో తన కుమార్తెకు వివాహం జరిపించడానికి చాలా సంబంధాలు చూస్తాడు ఆ రాజు.అయితే అమ్మాయికి మూడు కన్నులు ఉండడంతో వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.దీంతో అమ్మాయిని వివాహం చేసుకున్నవారికి వజ్ర,వైడూర్య,బంగారు కానుకలు భారీస్థాయిలో ఇస్తానని రాజు ప్రకటిస్తాడు.అంతే కాకుండా అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత రాజ్యం నుండి దూరం గా వెళ్లిపోవాలని సూచిస్తాడు.
ఈ వార్త కొద్ది సమయంలోనే రాజ్యమంతా విస్తరిస్తుంది.అయినా ఎవరూ వివాహం చేసుకోవడానికి ముందుకు రారు.అయితే ఈ వార్త విన్న ఓ అంధుడు తన వికలాంగుడు అయిన తమ్ముడు తో రాజ్యంలోకి వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్తాడు.దానికి అంగీకరించిన రాజు తన కూతురుని ఇచ్చి వివాహం చేసి తాను ప్రకటించిన కానుకలు ఇచ్చి రాజ్యం నుండి బయటకి పంపిస్తాడు.
కాగా ఆ అంధుడు , వికలాంగుడు అయిన ఆ అంధుడి సోదరుడు మరియు రాజకుమారి కలిసి జీవిస్తూ ఉంటారు.అయితే రాజకుమారి తన మరది అయిన వికాలాంగుడు తో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది.ఎలా అయినా తన భర్తను చంపేసి తన మరిది తో ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని రాజకుమారి అనుకుంటుంది.దానిలో భాగంగా ఓ విషపూరితమైన పాము ను తీసుకొచ్చి కూర చేసి ఆ అంధుడిని చంపేద్దాం అని వికలాంగుడు మరియు రాజకుమారి ఓ చనిపోయిన పామును ఇంటికి తీసుకువస్తారు.
అయితే ఆ పాము ను రాజకుమారి కూర ఉండుతూ ఇది చేపల కూర అని తన భర్తతో చెప్తుంది .అయితే మధ్యలో కూరను కదుపుతూ ఉండమని తన భర్త అయిన అంధుడికి అప్పగిస్తుంది.అయితే ఆ సమయంలో తన మరిది అయిన వికాలాంగుడితో సరసాలు ఆడుతూ ఉంటుంది రాజకుమారి.అయితే కూరను కదుపుతున్న అంధుడికి ఆ పాము కూరలో నుండి వచ్చే ఆవిరితో చూపు వస్తుంది.ఆ అందుడుకి చూపు రాగానే రాజకుమారి తన తమ్ముడితో సరసాలు ఆడడం కనిపిస్తుంది.అయినా కానీ చూపు రానట్టే ఉండిపోతాడు ఆ అంధుడు.
కాగా మరుసటి రోజు జరిగిన విషయాన్ని అంతా రాజ్యానికి వెళ్లి రాజుతో చెప్తాడు ఆ వ్యక్తి .అయితే జరిగిన మోసాన్ని గ్రహించిన రాజు తన రెండొవ కూతురిని ఇచ్చి ఆ వ్యక్తి కి వివాహం చేయిస్తాడు.అయితే మనం మంచి మనసుతో ఏదైనా పని చేస్తే ఎదుటివారు మనకి చెడు చెయ్యాలని చూసినా మనకి మంచే జరుగుతుంది అనడానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ. ఏదైనా పని చేస్తే ఎదుటివారు మనకి చెడు చెయ్యాలని చూసినా మనకి మంచే జరుగుతుంది అనడానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ.
End of Article