Ads
మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా ఇటీవల విడుదల అయ్యింది. గత సంవత్సరం మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు విష్ణు. ఆ సినిమా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే డిఫరెంట్ గా ఉంది. చాలా రోజుల తర్వాత విష్ణు ఒక కామెడీ సినిమాలో నటించారు. అలాగే ఇందులో కొన్ని హారర్ అంశాలు కూడా ఉన్నాయి. కథ పెద్ద కొత్తగా ఏమీ లేకపోయినా కూడా ప్రేక్షకులకి డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నించారు.
Video Advertisement
ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీ నటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు చేశారు. మంచు విష్ణు ఈ సినిమాలో చిత్తూరు యాస మాట్లాడారు. మంచు విష్ణు కూడా తన పాత్రకి తగ్గట్టుగా నటించారు. సంగీతం కూడా సినిమా కి తగ్గట్టుగా ఉంది. అయితే సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కూడా కొన్ని విషయాలపై కామెంట్స్ వస్తున్నాయి. సినిమా నెగిటివ్ టాక్ కి కారణం అయిన ఆ విషయాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 సినిమాలో ఎంచుకున్న పాయింట్ బాగుంది. హారర్ కామెడీగా ఈ సినిమాని రూపొందించారు. కామెడీ అక్కడక్కడ బాగుందిలే కానీ, హారర్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పాలి. సన్నీ లియోన్ తో హారర్ సీన్స్ తెరపై చూపించే ప్రయత్నం చేశారు. కానీ అవి ప్రేక్షకులకి అంత ఆసక్తిగా అనిపించలేదు.
#2 సినిమాలో నటీనటులు మన నేటివిటీకి ఎంత తగ్గట్టు ఉంటే సినిమా కూడా అంత బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఇందులో సన్నీ లియోన్ నటన పరంగా బాగానే ఉన్నా కూడా డబ్బింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఆమె తెరపై చెప్పే డైలాగ్స్ ఒకటి ఉంటే, మనకి వచ్చే వాయిస్ ఒకటి ఉంటుంది. దాంతో రెండు సింక్ అయినట్టు అనిపించవు.
#3 సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మొదట్లో వచ్చే పిల్లల పార్ట్ బాగుంది. కానీ దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా చాలా వరకు సీన్స్ ఏదో హడావిడిలో వెళ్లిపోయినట్లు అనిపిస్తాయి.
#4 సినిమాలో పాత్రలు రూపొందించిన విధానం కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే హీరో పాత్ర మొదట్లో సన్నీలియోన్ కి చెందిన ఆస్తి తీసుకుందామని అనుకుంటాడు. కానీ తర్వాత డబ్బు కోసం అన్యాయమైన పనులు చేయను అని చెప్తాడు. దాంతో, “అదేంటి ముందు హీరో అలా అనుకున్నాడు కదా? మళ్లీ ఇలా అనడం ఏంటి?” అంటూ కామెంట్స్ వచ్చాయి. అందుకే పాత్రలు రూపొందించిన విధానం కూడా ఇంకా కొంచెం బాగుంటే సినిమా ఫలితం వేరేలా ఉండేదేమో అని అన్నారు.
#5 సినిమాలో కొన్ని సీన్స్ కూడా లాజిక్ కి సంబంధం లేకుండా ఉన్నాయి. కొన్ని ఫైటింగ్ సీన్స్ అయితే అసలు నిజ జీవితంలో అలాంటి జరుగుతాయా అని ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. సాధారణంగా సినిమా అన్న తర్వాత కమర్షియల్ అంశాలు ఉంటాయి. దాంతో ఫైటింగ్స్ కూడా కాస్త భారీగానే ఉంటాయి. కానీ ఇందులో మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ విషయాలపై ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. వీటిలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అని అంటున్నారు. దాంతో సినిమాకి టాక్ మిక్స్డ్ గా వస్తోంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.
End of Article