Ads
రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ పాన్ ఇండియా హీరోగా ఏ స్థాయికి వచ్చాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈశ్వర్ సినిమా విడుదలైన సమయంలో అతను ఈ స్థాయికి వస్తాడని ఎవరు కలలో కూడా అనుకోలేదు. మొదటి సినిమాలో అతని నటనపై విమర్శలు చాలా వచ్చినప్పటికీ ప్రభాస్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. సినిమా సినిమాకు తనను తాను సరికొత్త నటుడిగా మార్చుకుంటు అగ్ర దర్శకులు కమర్షియల్ దర్శకులను ఎట్రాక్ట్ చేశాడు.
Video Advertisement
ప్రభాస్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి మనందరికీ తెలిసిన విషయమే. దీంతో ప్రభాస్ ఆస్తులపై ఎప్పటికప్పుడు అనేక రకాల కథనాలు వస్తుంటాయి. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు నిర్మాతగా ఉన్న రోజుల్లో అనేక ఆస్తులు కూడబెట్టారట.
ఇప్పుడు ప్రభాస్ దగ్గర ఉన్న విలువైన ఆస్తులేవో చూద్దాం..
#1 ఫార్మ్ హౌస్ లు
ప్రభాస్ కి హైదరాబాద్ సిటీ ఔటస్కర్ట్స్ లో 60 కోట్ల విలువైన ఒక ఫార్మ్ హౌస్, భీమవరం లో 84 ఎకరాల్లో ఒక ఫార్మ్ హౌస్ ఉన్నాయి.
#2 వివిధ నగరాల్లో స్థిర, చరాస్తులు
ప్రభాస్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో పాటు చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాలను కొన్నారు.
#3 లంబోర్గాని అవేంటడోర్ రోడ్‌స్టర్
ప్రభాస్ దగ్గర అయిదున్నర కోట్ల విలువైన లంబోర్గాని అవేంటడోర్ రోడ్‌స్టర్ కార్ ఉంది.
#4 గ్రానైట్ ఫ్యాక్టరీ
ప్రభాస్ కు వారసత్వం గా వచ్చిన ఆస్తుల్లో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కూడా ఉంది.
#5 రోల్స్ రోస్ ఫాంటమ్ కార్
ప్రభాస్ దగ్గర 10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్ ఉంది.
#6 మల్టీప్లెక్స్ లు, పొలాలు, తోటలు
ప్రభాస్ కుటుంబానికి పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, మల్టీప్లెక్స్ లు ఉన్నాయి.
#7 ల్యాండ్ రోవర్
ప్రభాస్ దగ్గర 4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ కార్ ఉంది.
ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలతో బిజీ గా ఉన్న ప్రభాస్ నికర విలువ 250 కోట్లు ఉంటుందని అంచనా.
End of Article