Home Filmy Adda నిజంగానే “సమంత” ని నాగ చైతన్య కలిసారా..? ఇందులో నిజం ఎంతంటే..??

నిజంగానే “సమంత” ని నాగ చైతన్య కలిసారా..? ఇందులో నిజం ఎంతంటే..??

by Anudeep

స్టార్ హీరోయిన్‌ సమంత తీవ్ర అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ టాలీవుడ్‌, కోలీవుడ్‌ సెలబ్రిటీలు ట్విటర్‌ ద్వారా తెలియజేస్తున్నారు. కొంతమంది నేరుగా ఆమెను కాంటాక్ట్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని, ఇప్పట్లో ఎవరినీ కలిసే అవకాశం లేదని చెబుతున్నారు.

అయితే సామ్ హెల్త్ విషయం తెలిసి సామ్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత అనారోగ్యంపై వస్తున్న వార్తలు నిజమే అని తెలుసుకొని నిరాశ చెందారు.

did naga chaitanya met samantha in hospital..

అయితే ఈ సమయంలో సమంతను నాగచైతన్య కలిశారు, ఆరోగ్యం గురించి వాకబు చేశారని వార్త ఒకటి టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంలో నిజమెంత అనేది తెలుసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఈ నేపథ్యంలో సమంతను నాగచైతన్య కలిశాడా లేదా అనేది చూస్తే.. పుకార్ల ప్రకారం సమంతను నాగచైతన్య ఆసుపత్రిలో కలిశాడు అని పుకార్లు వచ్చాయి.

did naga chaitanya met samantha in hospital..

వీటి ప్రకారం చూసుకుంటే..సామ్ హెల్త్ ఇష్యూ గురించి తెలిసిన వెంటనే నాగచైతన్య రెస్సాండ్ అయ్యారట. ఆమె అప్పుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి మరీ ధైర్యం నూరిపోశారట. అంతేకాదు.. ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయమని సూచించారట. ఇందులో నిజం సంగతి అటుంచితే ఇక సామ్ చైతూ కలిసిపోతున్నారంటూ ఇంకాస్త అడ్వాన్స్ అయ్యి న్యూస్ పుట్టించారు కొందరు. కానీ అందుకు సంబంధించిన ఏ ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.

did naga chaitanya met samantha in hospital..

అందులో ఏమాత్రం నిజం లేదని, ఇది కావాలనే కొందరు పుట్టించిన వార్త అని చెప్పుకుంటున్నారు జనం. సమంత ప్రస్తుతం ఆసుపత్రిలో లేదని, ఇంట్లోనే చికిత్స తీసుకుంటోందని సమాచారం. తన వ్యాధి గురించి చెప్పిన సమయంలో కూడా సామ్ ఆసుపత్రిలో లేదు. కాబట్టి సమంత కోసం నాగ చైతన్య హాస్పిటల్ వెళ్లారని వస్తున్న వార్తల్లో వాస్తవం అయితే లేదని ఓ నిర్దారణకు వచ్చేశారు జనం. ఒకవేళ అదే జరిగి ఉంటే నాగ చైతన్య కనీసం ఆసుపత్రి కెమెరా కంటికైనా పడేవాడుగా అంటూ లాజిక్స్ వెతుకుతున్నారు.

You may also like