అక్కడ అట్టర్ ఫ్లాప్… కానీ ఇక్కడ సూపర్ హిట్..! “ఆచార్య” క్రేజ్ మాములుగా లేదుగా..?

అక్కడ అట్టర్ ఫ్లాప్… కానీ ఇక్కడ సూపర్ హిట్..! “ఆచార్య” క్రేజ్ మాములుగా లేదుగా..?

by Megha Varna

Ads

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.

Video Advertisement

ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు.

కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. చిరంజీవి నటన బాగున్నా కూడా చాలా సీన్స్ లో చాలా డల్ గా ఎనర్జీ లేకుండా నటించారు అన్నట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

chiru comments on aacharya movie flop

సహాయ పాత్రల్లో చాలా మంది తెలిసిన నటులు ఉన్నాకూడా పెద్దగా హైలెట్ అయ్యే పాత్రలు ఎవరివి లేవు. అంతే కాకుండా కాజల్ పాత్ర కూడా సినిమా నుండి కట్ చేశారు. ఇలా ఆచార్య హిట్ కొట్టలేకపోయింది. కానీ టీవీ లో మాత్రం ఆచార్య కి అదిరే టీఆర్పీ వచ్చింది. శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ తీసుకోగా.. అక్టోబర్ 23 సాయంత్రం 5:30 గంటలకు ఆచార్య సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసింది. అయితే ఎవరు ఇంత టీఆర్పి వస్తుంది అని అనుకోలేదు. కానీ 6.30 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. అసలెవరు చూడరని అనుకున్న సినిమాకు ఇంత టీఆర్పీ రావడం గొప్పే.


End of Article

You may also like