Home Filmy Adda మరోసారి వివాదంలో నిలిచిన “సాయి పల్లవి”..! “అలాంటివి అంటేనే అసహ్యం..!” అంటూ..?

మరోసారి వివాదంలో నిలిచిన “సాయి పల్లవి”..! “అలాంటివి అంటేనే అసహ్యం..!” అంటూ..?

by Anudeep

మలయాళ నటి సాయి పల్లవి డాన్స్ షో లతో గుర్తింపు పొంది..హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె తన సహజ నటనతో ఎందరో అభిమానులను గెలుచుకున్నారు. స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి తెలుగులో ‘ఢీ’ షో తో పాటు కన్నడ, తమిళ భాషల్లో ప్రసారమైన డాన్స్ షోస్ లో పాల్గొని ప్రతిభ నిరూపించుకున్నారు.

 

అయితే తాజాగా డాన్స్ రియాలిటీ షోస్ ని ఉద్దేశిస్తూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. అసలు డాన్స్ రియాలిటీ షోలలో జరిగేదంతా మోసమే అని పరోక్షంగా చెప్పడం ద్వారా సాయి పల్లవి అతి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు.

sai pallavi contravarcial comments goes viral..

ఇటీవల సాయి పల్లవి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడూతూ… టెలివిజన్ ఛానల్స్ లో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. ప్రముఖుల వారసులకే మర్యాదలు, గౌరవాలు దక్కుతాయి. అందుకే నాకు డాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదు. ఒక విధంగా చెప్పాలంటే డాన్స్ పోటీలు అంటే నాకు అసహ్యం, అన్నారు.

sai pallavi contravarcial comments goes viral..

డాన్స్ షోస్ తో వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి ఇంత దారుణమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. మంచి డాన్సర్ అయిన సాయి పల్లవి విజయ టీవీలో ప్రసారమైన తమిళ డాన్స్ రియాలిటీ షో ”ఉంగళిల్ యారు అడుత్త ప్రభుదేవా” షోలో పోటీపడ్డారు. ఫైనల్ కి చేరిన సాయి పల్లవి రన్నర్ గా నిలిచారు. ఆ షో లో తనకు అన్యాయం జరిగిందన్న బాధ తో సాయి పల్లవి ఇలా మాట్లాడారా అని కొందరు చర్చించుకుంటున్నారు.

sai pallavi contravarcial comments goes viral..

ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్దిస్తుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. నటిగా అందరి మనసులు గెలుచుకున్న సాయి పల్లవి ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఆమె అభిమానులను బాధిస్తోంది.

You may also like