Home Filmy Adda “వంటలక్క” గా పాపులర్ అయిన… “ప్రేమి విశ్వనాధ్” ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

“వంటలక్క” గా పాపులర్ అయిన… “ప్రేమి విశ్వనాధ్” ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

by Anudeep

ప్రేమి విశ్వ‌నాథ్ అలియాస్ వంటలక్క . ఈ పేరు తెలుగు బుల్లితెర‌పై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ న‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేస్తున్న‌ది ఒకే ఒక్క సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ.. మిగిలిన ఏ సీరియ‌ల్ న‌టీన‌టులు ఆమెను బీట్ చేయ‌లేక‌పోతున్నారు.

 

ఆమె అమాయకత్వం.. డాక్టర్ బాబు కోసం ఆమె పోరాటం.. కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్ ను ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రేమీ విశ్వనాథ్ కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

is premivishwanath that rich..
తెలుగులో ఎంతో పాపులారిటీ ని సంపాదించుకున్న ఈమె తెలుగామె కాదు. ఈమె సొంత ఊరు కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకులం.ప్రేమి ఓ లాయర్. మోడలింగ్ కూడా చేస్తుంది. ఈమె భర్త వినీత్‌ భట్‌ పెద్ద జ్యోతిష్యుడు.డాక్టరేట్ కూడా పొందాడు.ప్రేమి కుటుంబం ఆర్థికం గా స్థిరపడిన కుటుంబమే అంట. ఈమెకు కేరళలో ఏకంగా రెండు స్టూడియోలు ఉన్న విషయాన్ని ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

is premivishwanath that rich..
మలయాళ సినిమాలు సీరియల్స్ షూటింగ్ పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ స్టూడియోలోనే జరుగుతాయని ఈమె వెల్లడించారు.ఇలా స్టూడియోలతోపాటు ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా ప్రేమి విశ్వనాథ్ బాగా రిచ్ అని ఈమెకు సుమారు 40 కోట్లకు పైగా ఆస్తుపాస్తులు ఉన్నట్లు సమాచారం.

is premivishwanath that rich..
మళయాళంలో వచ్చిన కార్తీక దీపం సీరియల్‌లో విశేష ప్రజాభిమానాన్ని సంపాదించింది ప్రేమి . మలయాళం పలు సీరియళ్ల లో నటించిన ఆమె.. ఆ తర్వాత ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా కూడా చేసింది. ఈ భామ ఈ మధ్య కాలంలో ఆమె సీరియల్స్‌తో పాటు యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది. కార్తీక దీపం ఇచ్చిన క్రేజ్ తో పలు సినిమా అవకాశాలు కూడా ఆమెను వరిస్తున్నాయి.

You may also like