Home Filmy Adda “విశ్వక్ సేన్” పై నిర్మాతల రియాక్షన్..! చెప్పింది కరెక్ట్ ఏ కానీ..?

“విశ్వక్ సేన్” పై నిర్మాతల రియాక్షన్..! చెప్పింది కరెక్ట్ ఏ కానీ..?

by Anudeep

గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో అర్జున్ సర్జా, యువ హీరో విశ్వక్ సేన్ ల మధ్య జరుగుతున్న వివాదం అందరికి తెలిసిందే. అర్జున్ డైరక్షన్ లో సినిమా ఒప్పుకున్న విశ్వక్ సినిమా షూటింగ్ పెట్టుకుంటే మొదటి షెడ్యూల్ రాకుండా క్యాన్సిల్ చేశాడని మధ్యలో ఫోన్ లు కూడా ఎత్తలేదని.లేటెస్ట్ గా ఒక షెడ్యూల్ చేస్తే నైట్ వరకు బాగానే ఉన్నా షూటింగ్ రోజు రావడం కుదరదని చెప్పరని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

 

‘సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయటం తప్పే. కానీ, ఇష్టం లేకుండా నాలుగు రోజులు చేసి ఆ తర్వాత బ్రేక్‌ తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్య మాట్లాడాను. అర్జున్‌గారికి అంత గౌరవం ఇచ్చా.’ అంటూ విశ్వక్ సేన్ కూడా దానిపై స్పందించారు. ఈ సినిమాని సొంతంగా అర్జున్ నిర్మిస్తుండగా.. హీరోయిన్‌గా అతని కూతురు ఐశ్వర్య నటిస్తున్నారు.

producers comments on vishwaksen behaviour

‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో హిట్‌ని అందుకున్న విశ్వక్ సేన్.. ఇటీవల ‘ఓరి దేవుడా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో నడుస్తోంది. అలానే కొన్ని ప్రాజెక్ట్స్ అతని చేతిలో ఉన్నట్లు టాక్. ఈ దశలో విశ్వక్ సేన్ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

producers comments on vishwaksen behaviour
విశ్వక్ చెప్పింది కరెక్టే.. కానీ విశ్వక్ పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఓ దర్శకుడు చెప్పిన కథకి హీరో ఒప్పుకున్నప్పుడు.. ప్రాజెక్టు సైన్ చేసినప్పుడు.. అది పూర్తి చేయాల్సిన బాధ్యత అతనిదే అని పలువురు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.

producers comments on vishwaksen behaviour

You may also like