బాలీవుడ్ సినిమాలో “భూమిక”..! హీరో ఎవరంటే..?

బాలీవుడ్ సినిమాలో “భూమిక”..! హీరో ఎవరంటే..?

by Mohana Priya

Ads

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి భూమిక చావ్లా. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భూమిక నటించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ సినిమాల్లో కూడా భూమిక నటించారు. అయితే భూమిక మళ్లీ చాలా సంవత్సరాల తరువాత హిందీ సినిమాలో నటిస్తున్నారు అని సమాచారం.

Video Advertisement

అది కూడా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో భూమిక ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమాలో ఒక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ భూమిక కలిసి అంతకుముందు తేరే నామ్ సినిమాలో నటించారు.

ఇది మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్య శ్రీ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే వెంకటేష్, రామ్ చరణ్ కూడా అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా కాటమరాయుడు రీమేక్ అని వార్త వచ్చింది. ఇంక భూమిక విషయానికి వస్తే ఇటీవల సీతారామం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో భూమిక కనిపించేది కొంచెం సేపు అయినా కూడా భూమిక పోషించిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.


End of Article

You may also like