Home Filmy Adda “సమంత” ఈ విషయాన్ని మాతో ఎప్పుడు చెప్పలేదు..! యశోద హీరో “ఉన్ని ముకుందన్” కామెంట్స్ ..!

“సమంత” ఈ విషయాన్ని మాతో ఎప్పుడు చెప్పలేదు..! యశోద హీరో “ఉన్ని ముకుందన్” కామెంట్స్ ..!

by Anudeep

ప్రముఖ సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

 

అయితే సమంత తాను అనారోగ్యం తో ఉన్న విషయం “యశోద” సెట్స్ లో ఎప్పుడు చెప్పలేదని నటుడు ఉన్ని ముకుందన్ వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన సమంత ఆరోగ్యం పై స్పందించారు.

UNNI MUKUNDAN ABOUT SAMANTHA DEDICATION AND HARDWORK

” షూటింగ్ సమయం లో నాకు ఈ విషయం తెలియదు. సమంత తన ఆరోగ్యం గురించి ఇంతగా పోరాడుతుందని చెప్పలేదు. సమంత చాలా ప్రొఫెషనల్. ఈ సినిమాలో ఫైట్లు, యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఆమె సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో బాగా ఇంటరాక్ట్ అవుతుంది. అటువంటి వ్యాధితో పోరాడుతున్నట్లు ఆమె ఎప్పుడూ వెల్లడించలేదు. సమంత పోస్ట్ చూసిన తర్వాత బాధగా అనిపించింది. ఆమె ఆ వ్యాధితో పోరాడి తిరిగి ఆరోగ్యంగా రావాలని కోరుకుంటున్నా.” అని ఉన్ని ముకుందన్ తెలిపారు.

UNNI MUKUNDAN ABOUT SAMANTHA DEDICATION AND HARDWORK

అయితే సమంత కూడా తన “యశోద’ చిత్ర ప్రమోషన్స్ కోసం తన అనారోగ్యం గురించి ప్రకటించిన తర్వాత మొదటిసారి బయటకు వచ్చింది. ఆ సమయం లో సమంత భావోద్వేగానికి గురి కావడం అందరిని కలచివేసింది. మయోసైటిస్ అనే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఇప్పటికే తెలుసుకున్నాం. అయినా కూడా తన యశోద సినిమా కోసం ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది సమంత.

UNNI MUKUNDAN ABOUT SAMANTHA DEDICATION AND HARDWORK

హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమా సరోగసి నేపథ్యంలో నడుస్తుంది.

You may also like