Ads
సమంత హీరోయిన్ గా రాబోతున్న సినిమా యశోద. ఈ సినిమాకి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సమంత గర్భవతి పాత్రలో నటించారు. సమంత ఒక ఛాలెంజింగ్ పాత్ర పోషించారు అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఇందులో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు.
Video Advertisement
అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, శత్రు, మురళీ శర్మ, శత్రు ఇంకా ఎంతోమంది ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్ ఇటీవల పూర్తి చేసుకుంది. సినిమా సెన్సార్ షో చూసిన సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు సమాచారం.
అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకులు మీడియాతో మాట్లాడారు. “సమంతతో పనిచేయడం ఎలా ఉంది?” అని అడిగిన ప్రశ్నకు, సమంత చాలా హార్డ్ వర్కింగ్ అని, అసలు గ్లిజరిన్ కూడా వాడరు అని, దర్శకులు ఎలాంటి నటన కోరుకుంటారో అలాగే నటిస్తారు అని అన్నారు. అలాగే తన హెల్త్ కండిషన్ గురించి అసలు ఏమీ చెప్పలేదు అని, మీకు ఓకేనా? లేదా ఇంకొక టేక్ చేద్దామా అని అడిగేవారు అని అన్నారు. ఇది కేవలం పాన్-ఇండియన్ సినిమా మాత్రమే కాదు అని పాన్-యూనివర్సల్ గా కూడా చాలా కొత్త కాన్సెప్ట్ సినిమా అని దర్శకుడు అన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథని రాసుకొని డెవలప్ చేసాం అని చెప్పారు.
End of Article