ఈ 22 మంది నటులకు డబ్బింగ్ చెప్పిన హీరో – హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఈ 22 మంది నటులకు డబ్బింగ్ చెప్పిన హీరో – హీరోయిన్లు ఎవరో తెలుసా?

by Mohana Priya

Ads

చాలా సినిమాల్లో కొన్ని పాత్రలు ప్రేక్షకులకి ఎంతో కాలం వరకు గుర్తుండిపోతాయి. అలా గుర్తుపెట్టుకునేలా ఒక పాత్ర ఉండాలి అంటే నటుల పర్ఫార్మెన్స్ తో పాటు డబ్బింగ్ కూడా ముఖ్యం. పాత్ర బాగుండి డబ్బింగ్ బాలేకపోతే ఆ పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారి కొంచెం చిరాకుగా అనిపిస్తుంది.అందుకే ఎంతో మంది డైరెక్టర్లు నటీనటుల ఎంపిక తో పాటు డబ్బింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. మన ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లు ఎన్నో సినిమాల్లో ఎంతో మంది ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్తారు.

Video Advertisement

కానీ ఒక సమయంలో వాళ్ళ గొంతు మోనోటోనస్ అయిపోతుంది. అంటే ప్రతి సినిమాలో వాళ్ళ గొంతు విని జనాలకి కొంచెం బోర్ అనిపిస్తుంది. అంతేకాకుండా చూడకుండా ఆ గొంతు వింటే అక్కడ ఉన్న నటులు ఎవరో కూడా జనాలకి అర్థం కాదు. అందుకే కొంతమంది డైరెక్టర్లు డబ్బింగ్ ఆర్టిస్ట్ కొత్తగా ఉండేలా చూసుకుంటారు.అలా మన ఇండస్ట్రీలో ఉన్న నటులు కూడా వేరే నటులకి డబ్బింగ్ చెప్పారు. వాళ్ళలో కొంతమంది కేవలం ఒక్క సినిమాకి మాత్రమే చెప్తే, మరికొంతమంది మాత్రం వాళ్ళ వాయిస్ ఆ నటులకి క్లిక్ అవడంతో వాళ్లకి పర్మినెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు. నటులకి డబ్బింగ్ చెప్పిన కొంతమంది నటులు ఎవరంటే.

#1 సత్యదేవ్ – నీల్ నితిన్ ముఖేష్ – సాహో

#2 రమ్యకృష్ణ – సోనాలి బింద్రే – ఖడ్గం

#3 సాయి కుమార్ 
రజినీకాంత్ – బాషా
రాజశేఖర్ – అంకుశం,……..

#4 కార్తీ – సూర్య – బ్రదర్స్

#5 చార్మి – కాజల్ – చందమామ

#6 ఉదయభాను – చార్మి – శ్రీ ఆంజనేయం

#7 రోహిణి

గిరిజ – గీతాంజలి

ఐశ్వర్యరాయ్ – రావణన్ (తెలుగులో విలన్ )

#8 ఆండ్రియా

తాప్సీ – ఆడుకలం (తమిళ్)

ఇలియానా – నన్బన్  (స్నేహితుడు తమిళ్)

అమీ జాక్సన్ – తంగ మగన్ (నవమన్మధుడు తమిళ్)

కమలిని ముఖర్జీ – వెట్టియాడు విళైయాడు (రాఘవన్ తమిళ్)

స్కార్లెట్ జోహన్సన్ – అవెంజర్స్ ఎండ్ గేమ్ (తమిళ్)

#9 రాశి 

నదియా – మిర్చి

కాజల్ అగర్వాల్ – లక్ష్మీ కళ్యాణం

#10 నాగబాబు – ఆడుకలం నరేన్ – పిజ్జా  (తెలుగు)


#11 శివాజీ –

నితిన్ – జయం, దిల్

యశో సాగర్ – ఉల్లాసంగా ఉత్సాహంగా

విజయ్ సేతుపతి – పిజ్జా

#12 ఎస్పీ బాలసుబ్రమణ్యం 

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గొప్ప గాయకుడి తో పాటు, మంచి నటులు, ఇంకా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. బాలుగారు మన్మధలీల సినిమాలో కమల్ హాసన్ పాత్ర కి డబ్బింగ్ చెప్పారు.

ఆయన గొంతు కమల్ హాసన్ కి నప్పడంతో తర్వాత కూడా కమల్ హాసన్ నటించిన ఎన్నో తమిళ చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు బాలు గారు. అలాగే నరేష్,    రజినీకాంత్ (కథానాయకుడు), అర్జున్ సర్జా, రఘువరన్, జెమినీ గణేషన్, అనిల్ కపూర్, సత్య రాజ్ (చిన్న బాబు), నాజర్ (అతడు), బాలకృష్ణ (శ్రీరామరాజ్యం తమిళ్), బెన్ కింగ్స్లే (గాంధీ తెలుగు) ఇంకా ఎంతో మంది నటులకి డబ్బింగ్ చెప్పారు.

#13 నిత్యా మీనన్ – ఈషా తల్వార్ – గుండెజారి గల్లంతయ్యిందే

#14 కలర్స్ స్వాతి – ఇలియానా – జల్సా

#15 రామ్ చరణ్ – సల్మాన్ ఖాన్ – ప్రేమలీల (ప్రేమ్ రతన్ ధన్ పాయో తెలుగు) 

#16 నాని – దుల్కర్ సల్మాన్ – ఓకే బంగారం

#17 ఉత్తేజ్ – వెన్నెల కిషోర్ – వెన్నెల

#18 మనో

కమల్ హాసన్ – సతీ లీలావతి

రజినీకాంత్ – ముత్తు,…….

#19 అనసూయ – ఇషా కొప్పికర్ – కేశవ

వీళ్లే కాకుండా కొంతమంది నటులు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎవరంటే

#20 రోజా రమణి

రోజా రమణి ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా సుహాసిని, రాధా, అర్చన, రాధిక, రజిని, శోభన, భానుప్రియ, గౌతమి, దివ్యభారతి, రోజా ఇంకా ఎంతో మందికి డబ్బింగ్ కూడా చెప్పారు.

#21 సరిత

మరో చరిత్ర సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సరిత ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు, సుజాత, మాధవి సుహాసిని, సుధా చంద్రన్, భానుప్రియ, విజయశాంతి, రాధ, శరణ్య, సౌందర్య, రోజా, ఆమని, టబు, నదియా, సుష్మితా సేన్, ఖుష్బూ ఇలా ఎంతో మంది కి డబ్బింగ్ చెప్పారు.

#22 రవిశంకర్

ఒకే సినిమాలో 2,3 పాత్రలకి డబ్బింగ్ చెప్పి ఘనతను సాధించారు రవిశంకర్. అలా చెప్పిన వాటిలో కొన్ని సినిమాలు ఇవే.

సై (నాజర్, ప్రదీప్ రావత్)

చత్రపతి (ప్రదీప్ రావత్, నరేంద్ర ఝా)

నరసింహుడు (ఆశిష్ విద్యార్థి, పునీత్ ఇస్సార్, రాహుల్ దేవ్)

అతడు (సోను సూద్, చరణ్ రాజ్, రాహుల్ దేవ్)

విక్రమార్కుడు (వినీత్ కుమార్, అజయ్)

రేస్ గుర్రం (శ్యామ్, రవి కిషన్, ముఖేష్ రిషి)

కిక్ 2 (రవి కిషన్, శ్యామ్, సంజయ్ మిశ్రా)

వీళ్లల్లో కొంతమంది నటులు పైన చెప్పిన సినిమాలకు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సినిమాలకు తమ గొంతును అందించారు.


End of Article

You may also like