సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక నిఘంటువు.. తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామ కృష్ణ గురించి నేటి తరానికి కూడా పరిచయం చేయాల్సిన పని లేని పేరు. సూపర్ స్టార్ కృష్ణ.. మంచి నటుడు, నిర్మాత, దర్శకులు మాత్రమే కాదు నిర్మాతల పాలిట కల్పవృక్షం.. మంచి మనసున్న వ్యక్తి.. సినీ పరిశ్రమలోని 24 క్రాప్ట్స్ పై పట్టు ఉన్న కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో చేయని ప్రయోగం లేదు.
అయితే సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. భార్య ఇందిరా దేవి మరణం తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన తాజాగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కృష్ణ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ కావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు కృష్ణ.

“ఆదివారం అర్థరాత్రి స్పృహ లేని స్థితిలో ఆయన్ను మా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. సీపీఆర్ చేసి 20 నిమిషాల్లో ఆయనను కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉంది. నిపుణులైన వైద్యులందరూ పర్యవేక్షిస్తున్నారు. చేయాల్సినదంతా చేస్తున్నాం. ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పలేం. ఆయన ఆరోగ్యంపై 24 గంటల తరువాత మళ్లీ మరొక ప్రకటన ఇస్తాం” అని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు మీడియా సమావేశంలో చెప్పారు.

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఎటువంటీ సినిమాలను చేయడం లేదు. హీరోగా ఆయన అనేక రికార్డు లు నెలకొల్పారు. ఆయన తనయుడు మహేష్ బాబు..సూపర్ స్టార్ నట వారసత్వాన్ని టాలీవుడ్లో కొనసాగిస్తున్నాడు.
watch video :
https://www.youtube.com/watch?v=9bwlq2WTRb8
