Home Bigg Boss 6 telugu పుష్ప-2 లో తన రోల్ పై… క్లారిటీ ఇచ్చిన గీతూ రాయల్..? ఏం అన్నారంటే..?

పుష్ప-2 లో తన రోల్ పై… క్లారిటీ ఇచ్చిన గీతూ రాయల్..? ఏం అన్నారంటే..?

by Anudeep

ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గీతూ రాయల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరరీ తెలిసిందే. అయితే టాప్ 5 లో లేదా టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్న గీతూ రాయల్ ఊహించిన విధంగా 9వ వారం ఎలిమినేట్ అయింది.

అయితే ఆమెకు పుష్ప 2 లో ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న గీతూ రాయల్ ఈ విషయం పై స్పందించింది.

geethu royal reacts on pushpa 2 chance..!!

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను పి ఆర్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వల్ల త్వరగా బయటకు వచ్చానని, ఇక నేను ఓడిపోవడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కారణమని తెలిపారు. బిగ్ బాస్ 6 గెలిచే అర్హత కేవలం ఆది రెడ్డికి, రేవంత్ కు మాత్రమే ఉందని చెప్పారు. బిగ్ బాస్ లో ఇనాయ వల్ల మాత్రమే కంటెంట్ వస్తుందని వెల్లడించింది. ఇకపోతే తనకి పుష్ప 2సినిమాలో అవకాశం వచ్చింది అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై కూడా ఈమె క్లారిటీ ఇచ్చారు.

geethu royal reacts on pushpa 2 chance..!!

“నాకు పుష్ప 2లో అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పటివరకు ఎవరు నన్ను సంప్రదించలేదు.. కాకపోతే పుష్ప కో డైరెక్టర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ” అని గీతూ వెల్లడించారు. ఇక తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి ఈమె తెలియజేస్తూ.. ఎప్పటికైనా రాజకీయాలలోకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలనేదే తన కోరిక అంటూ ఈ సందర్భంగా గీతూ తన గురించి వెల్లడించారు.

You may also like