Ads
భారత్ టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సజావుగా సాగుతున్న వారి సంసార జీవితం గత కొన్నేళ్లుగా ఆటుపోట్లు ఎదుర్కొంటుంది అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
Video Advertisement
ఇన్నాళ్లు పచ్చగా ఉన్న వారి సంసార జీవితంలో అలజడి రావడానికి కారణం ఒక మోడల్ అని తెలుస్తుంది. భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా సానియా తన కొడుకుతో కలిసి గత కొద్ది కాలంగా వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య గొడవలకు షోయబ్ మాలిక్ చేసిన మోసమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లి చేసుకున్న సానియా, 2018లో కొడుకు ఇజహాన్‌కు జన్మనిచ్చింది. గత 12 సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఈ జోడి ఇటీవల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వీళ్ళ సంసారం సాఫీగా సాగడం లేదని త్వరలో విడాకులు తీసుకుంటారని మీడియా కోడై కూస్తోంది. ఇటు ఇరదేశాల్లోనూ వీరి విడాకుల గురించి పుకార్లు మరియు చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు వీటిపై ఇరుపక్కల నుంచి ఎటువంటి స్పందన లేదు.
మరోపక్క వీళ్ళ విడాకుల వార్త నిజమేనని, ఓ మోడల్ తో షోయబ్ మాలిక్ పెట్టుకున్న వివాహేతర సంబంధమే దీనికి కారణం అని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్ కు ఈ సదరు మోడల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి షోయబ్ ఆ మోడల్ మోజులో పూర్తిగా ఇరుక్కుపోయాడు. దాంతో భార్య సానియాను పట్టించుకోవడం మానేసాడు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ ఆ మోడల్ ఎవరు అని ఆలోచిస్తున్నారా..ఆమె పాక్ మోడల్ ఆయేషా ఒమర్. అయేషా ‘కొల్లేగే జీన్స్’, ‘కుచ్ లమ్హే జిందగీ కే’, ‘మేరీ జాత్ జరా ఈ బెనేషన్’, ‘దిల్ కో మనానా అయా నహీ’, ‘జిందగీ గుల్జార్ హై, ‘బుల్బుల్లే’, ‘మేరి గుడియా’ మరియు ‘మేరా దర్ద్ బెజుబాన్ వంటి అనేక టెలివిజన్ సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు. ‘కరాచీ సే లాహోర్’ అనే రొమాంటిక్ కామెడీ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది.
అయితే ఓ స్థానిక మ్యాగజైన్ కోసం షోయబ్ మాలిక్ తో కలిసి ఆమె గత సంవత్సరం ఒక బోల్డ్ ఫోటోషూట్ లో పాల్గొనింది. హెల్త్ అండ్ ఫిట్నెస్ పై అవగాహనలో భాగంగా నిర్వహించిన ఈ ఫోటోషూట్ ఫొటోస్ ను ఆయేషా తన ఇన్స్టాల్ లో షేర్ చేసింది. వెంటనే ఆమెను నటిజన్లో ఎంతో దారుణంగా ట్రోల్ చేశారు. సానియాతో మనస్పర్ధలు ఉన్న షోయబ్ ఆయేషా వైపు మొగ్గు చూపాడు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
End of Article