Ads
కాంతారావు గారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు ఈ తరం వాళ్లకి ఆయన ఎవరో తెలియకపోవచ్చు కానీ అప్పటి వారికి ఈయన బాగా తెలుసు. అద్భుతమైన నటన తో ఆకట్టుకునే వారు ఈయన. తెలుగులో వందల చిత్రాలను చేసారు కాంతారావు.
Video Advertisement
అప్పటి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోల తో పోటీ పడ లేక పోయారు. ఈ కారణం వలనే ఆయన సినిమాల్లో సహాయ నటుడిగా నటించడం మొదలు పెట్టారు.
కానీ సహాయ నటుడిగా కూడా కాంతారావు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి ఈయన నిర్దోషి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 100 కాదు 200 కాదు ఏకంగా నాలుగు వందల కి పైగా చిత్రాల్లో నటించారు కాంతా రావు గారు. సహాయ నటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, విలన్ గా కూడా కొన్ని సినిమాలు చేసి ఎంతగానో ప్రేక్షకులని మెప్పించారు. చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమా లో కూడా కాంతారావు గారు నటించారు. ఎంతో గొప్ప నటుడు అయన కాంతా రావు గారి అద్భుతమైన నటనకు 2000వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య పురస్కారం ఇచ్చారు.
2009వ సంవత్సరంలో ఈయన క్యాన్సర్ కారణంగా మరణించడం జరిగింది. దానితో ఈయన పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంత పేరు తెచ్చుకున్న నటుడి పిల్లలు ఇంతలా బాధ పడడం బాధాకరం. గొప్ప నటుడి పిల్లలయినప్పటికీ ఇప్పుడు ఇల్లు లేక బాధ పడుతున్నారు దీనికి గల కారణం ఏమిటంటే కాంతారావు గారి సినిమాల కోసం ఆస్తులని అమ్మేయడమే. దీని మూలంగా ఆయన పిల్లలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల తో బాధపడుతున్నారు. ఒకప్పుడు చెన్నైలో బంగ్లాలో ఉండే వారు కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల తో కాంతారావు గారి పిల్లలు సతమతమవుతున్నారు. దానితో వాళ్ళు వారి కోసం ఇల్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
End of Article