Home Filmy Adda నడవలేని పరిస్థితుల్లో “జబర్దస్త్” టాప్ కమెడియన్..? మరింత క్షీణించిన ఆరోగ్యం..!

నడవలేని పరిస్థితుల్లో “జబర్దస్త్” టాప్ కమెడియన్..? మరింత క్షీణించిన ఆరోగ్యం..!

by Anudeep

జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు లైఫ్ అందుకున్నారు. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. అయితే ఇలా మనల్ని నవ్వించే కమెడియన్ల జీవితాల్లో కూడా బాధ ఉంటుందని మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్‌లో ఇలాంటి విషాదమే ఉంది. అతడే పంచ్ ప్రసాద్. వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తుంటాడు ఈయన.

కొంతకాలం కిందట పంచ్ ప్రసాద్ కి రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయాయి. అప్పుడు నాగ బాబు, రోజా తో సహా పలువురు కమెడియన్లు సాయం చేసారు. తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో తమ కామెడీ టైమింగ్ తో నవ్విస్తున్నాడు ప్రసాద్.

 what happened to jabardasth punch prasad..

అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. “ఓ రోజు షూటింగ్ పూర్తైన వచ్చిన తర్వాత పంచ్ ప్రసాద్ జ్వరం వచ్చిందన్నారు. ఆ తర్వాత డాక్టర్ సలహాతో పెయిన్ కిల్లర్ ఇస్తే వేసుకున్నాడట. ఆ తర్వాత జ్వరం, నడుపు నొప్పి తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించారు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో చివరకు MRI స్కాన్ చేస్తే నడుము వెనక భాగం నుంచి కాలి వరకు చీము పట్టిందని” ప్రసాద్ భార్య తెలిపారు. ఈయన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ జబర్ధస్త్ నటుడు నూకరాజు ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.

 what happened to jabardasth punch prasad..
డయాలిసిస్ చేయించుకునే రోగుల్లో నెమ్మదిగా ఇలాంటి సమస్యలు వస్తాయట. టెస్ట్ చేసిన తర్వాత ఇది మందులతో తగ్గుతుందా.. ? లేకపోతే ఆపరేషన్ చేస్తారా అనేది డాక్టర్లు చెబుతానన్నారు అంటూ నూకరాజు చెప్పుకొచ్చాడు. అయితే నూకరాజు బలవంతం చేయడంతో తన ఆరోగ్య పరిస్థితిని బయటపెట్టాడు పంచ్ ప్రసాద్. ఈ సందర్భంగా ప్రసాద్‌కు ఆశీస్సులు అందించాలని ప్రేక్షకులు, అభిమానులను కోరారు నూకరాజు.

watch video :

You may also like