అంత మంది “హీరోయిన్స్” ఉండగా… ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోంది..?

అంత మంది “హీరోయిన్స్” ఉండగా… ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోంది..?

by kavitha

Ads

సినిమాలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆ పాత్రకు తగ్గ నటులని ఎంచుకోవడం. ఒకవేళ ఆ పాత్రకి ఆ యాక్టర్ న్యాయం చేసేలాగా నటిస్తే, యాక్టర్ కి మంచి పేరు రావడం మాత్రమే కాకుండా పాత్ర కూడా తెరపై చాలా బాగా కనిపిస్తుంది.

Video Advertisement

పాత్ర కోసం నటీనటుల గెటప్ మార్చడం అనేది చాలా సహజం. కానీ కొన్ని సార్లు మాత్రం అంత చేయాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్.దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

why this thing is happening with heroines in indian movies

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. అయితే అందులో హీరోయిన్ ని టాన్ చేసి చూపించారు. ఆ టీజర్ చూసిన వారు అదేంటి ఆమెని అలా చూపించారని అంటున్నారు. కానీ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు. పూర్తి కథ తెలియదు కాబట్టి ఇప్పుడు విడుదల అయిన టీజర్ మీద మాత్రమే కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఒకసారి మన భారతీయ సినిమాలని పరిశీలిస్తే, ఇలాంటివి అంతకు ముందు చాలా జరిగాయి. ఇంతకు ముందు కూడా చాలా సినిమాలలో అందంగా ఉన్న కథానాయకలను ఇలాగే చూపించారు.

ఫ్యామిలీ మ్యాన్ లో సమంతను, అలాగే పుష్ప సినిమాలో రష్మికను కూడా అలానే టాన్ చేశారు. సమంత మంచి నటి. అందులో కామెంట్ చేయడానికి ఏమీ లేదు. అందులో సమంత నటన పరంగా కాదు యాక్షన్ పరంగా బాగా చేశారు అని కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే సమంత పాత్ర చాలా వరకు సీరియస్ గానే ఉంటుంది. ఈ పాత్ర కోసం సమంత స్టంట్స్ నేర్చుకుని చాలా కష్టపడ్డారు. అలాగే ఈ పాత్ర కోసం సమంతని నల్లగా చూపించారు.

2 iswarya world famous lover

దాని బదులు అదే కలర్ తో ఉన్న, బాగా నటించగలిగే నటి అయిన ఐశ్వర్య రాజేష్ కానీ, లేదా మరొకరిని కానీ తీసుకొని, అలాగే వారు కూడా స్టంట్స్ నేర్చుకుని చేస్తే అది కూడా బానే ఉండేది కదా అని అప్పట్లో బాగా కామెంట్లు వచ్చాయి. ఐరా మూవీలో నల్లగా అంధవికారంగా ఉండటంతో నష్టజాతకురాలు అనే ముద్రను వేసి సమాజంలో చీత్కారాలు ఎదుర్కొనే పాత్రలో నయనతారను చూపించారు. నష్ట జాతకురాలు అని చూపించడం వరకు బానే ఉంది.

కానీ కలర్ మార్చాల్సిన అవసరం ఏముంది. అయిన ఇది ఇప్పుడు మొదలైంది కాదు. పాత సినిమాలలో కూడా ఇలాంటివి ఉండేవి. ఊర్వశి చిత్రంలో అప్పటి పాపులర్ నటి శారద  ద్విపాత్రాభినయం చేసిన పాత్రల్లో ఒక పాత్ర అలాగే టాన్ చేసి చూపించారు. మళ్లీ ఆ పాత్రని సినిమాలో కామెంట్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఆ పాత్రకి అది అవసరం అని అనుకుందాం. కానీ మంచి పాత్రల్లో కూడా అలాగే ఒక తెల్లగా ఉన్న నటిని ఇలా కలర్ మార్చి చూపించాల్సిన అవసరం ఏముంది. అలాంటి పాత్రలు ఉన్నప్పుడు, అలాంటి ఛాయ ఉండి, బాగా నటించగల హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, రాధికా ఆప్టే వంటి నటీమణులను ఎంచుకోవచ్చు.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చేసిన పాత్ర అలాంటిదే. అదే కాకుండా కలర్ ఫోటోలో సుహస్ చేసిన పాత్ర. వాళ్లీద్దరు ఆ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయారు. గెటప్ మార్చడం వరకూ సరే, కానీ సహజంగా ఉండే మనిషి కలర్ కూడా మరి ఒరిజినల్ కలర్ కి ఆపోజిట్ గా చేసి చూపించాల్సిన అవసరం ఏముంది? ఆ కలర్ లో ఉండి బాగా నటించక కలిగే నటులు చాలా మంది ఉన్నారు కదా? పాత్రకు తగ్గ వారిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు, ఒక రంగులో ఉన్న వారి ఛాయను తగ్గించి చూపించాల్సిన అవసరం ఏముంది? అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


End of Article

You may also like