Ads
ఉద్యోగం పొందడం కోసం ఎంతగానో చాలా మంది కష్టపడుతుంటారు. అయినప్పటికీ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేరు. ఇంటర్వ్యూ లో సక్సెస్ పొందాలంటే కచ్చితంగా ఈ టిప్స్ ని ఫాలో అవ్వాలి. ఇలా కనుక మీరు అనుసరించారంటే కచ్చితంగా ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోతారు. ఇంటర్వ్యూ అనేది కీలకమైనది కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాలని మీరు ఆచరించి తీరాలి.
Video Advertisement
#1. కమ్యూనికేషన్:
కమ్యూనికేషన్ లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. మీ బాడీ లాంగ్వేజ్ వంటివి ఇంటర్వ్యూయర్ గమనిస్తారు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి.
#2. మంచిగా వినడం:
చాలామంది ఇతరులు చెప్పేది వినకుండా వాళ్లే మాట్లాడిస్తూ ఉంటారు అలా చేయడం వలన ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వలేరు. జాగ్రత్తగా విని ఆ తర్వాత మాట్లాడండి.
#3. ధరించే దుస్తులు:
మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు క్యాజువల్ గా ఉండే బట్టలని ధరించండి. మీరు వెళ్లే కంపెనీని దృష్టిలో పెట్టుకుని బట్టలు వేసుకునేలా చూసుకోండి.
#4. అతిగా మాట్లాడటం:
చాలా మంది చేసే పొరపాటు ఇదే. ఎక్కువ మాట్లాడి అనవసరంగా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు కేవలం అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పి మార్కులు కొట్టేయండి.
#5. మంచి పదాలను ఉపయోగించండి:
ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి మంచి మంచి పదాలతో సమాధానం ఇవ్వండి.
#6. ఎక్కువ ఆత్మవిశ్వాసం:
ఇది అసలు పనికిరాదు. అన్నీ నాకే తెలుసు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాను అన్నట్లు ఉండకండి ఇలా వీటిని జాగ్రత్తగా చూసుకుంటే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వడం ఈజీ.
End of Article