Ads
బాలయ్య హీరోగా రాబోతున్న పవర్ ఫుల్ ఏక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు మేకర్స్. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Video Advertisement
వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు రవిశంకర్, హానీ రోజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే ఈ రోజు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రూపంలో జై బాలయ్య సాంగ్ విడుదల చేసారు. అయితే ఈ సాంగ్ నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ సాంగ్‌ను కరీముల్లా ఆలపించారు. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ లిరిక్స్‌తో ఆడియన్స్‌కు గూజ్ బంప్స్ తెప్పించారు రామజోగయ్య శాస్త్రి. ఈ పాటలో మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. ఇక స్టైలిష్ గాగుల్స్‌తో ఆయన వేసిన స్టెప్పులు అభిమానులకు కనులవిందుగా అనిపించాయి.
మరో వైపు థమన్ మరోసారి కాపీ ట్యూన్ కొట్టాడంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. గతంలో విజయశాంతి చేసిన ‘ఒసేయ్ రాములమ్మ” చిత్రం టైటిల్ సాంగ్ లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే ట్యూన్ కాపీ చేసి జై బాలయ్యకు పెట్టారంటూ థమన్ పై అటాక్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ పై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article