SSMB28: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా విడుదల అయ్యేది అప్పుడేనా?

SSMB28: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా విడుదల అయ్యేది అప్పుడేనా?

by kavitha

Ads

Tollywood: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాగా రూపొందబోతున్న సినిమా ఆ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. 2వ షెడ్యూల్‌ను షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మికంగా మరణించడం ఆగిపోయింది.

Video Advertisement

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 11, 2023న వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కాబోతుంది. ఇంతకు ముందు ఈ మూవీని ఏప్రిల్ 28,2023న రిలీజ్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
Mahesh-Babu-Trivikram-telugu addaఇప్పటికే మహేష్‌బాబు,త్రివిక్రమ్‌ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్‌కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
mahesh-ssmb-telugu addaమరోవైపు మహేష్‌బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


End of Article

You may also like