Puri Jagannadh: పూరీ జగన్నాధ్ ఆ స్టార్ హీరోని ఒప్పించాడా?

Puri Jagannadh: పూరీ జగన్నాధ్ ఆ స్టార్ హీరోని ఒప్పించాడా?

by kavitha

Ads

Puri Jagannadh: ‘లైగర్’ డిజాస్టర్ అవడంతో దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రస్తుతం ఎటు తోచని స్థితిలో ఉన్నాడు. తానొకటి తలిస్తే అన్నచందంగా అయ్యింది పూరీ పరిస్థితి. లైగర్ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని పూరీ జగన్నాధ్ ఎంతగానో తపించి, రెండు సంవత్సరాలకు పైగా కష్టపడ్డాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం పూరీని తీవ్ర నిరాశపరిచింది.

Video Advertisement

మూలిగే నక్క పై తాటి పండు అన్నట్టుగా లైగర్ డిజాస్టర్ బాధలో ఉన్న ఈ మూవీ ప్రొడ్యూసర్స్ పై మనీలాండరింగ్ కేసు ఫైల్ అవడం మరింత ఇబ్బంది పెట్టింది. ఇటీవల పూరీ జగన్నాధ్, ఛార్మి, హీరో విజయ్ దేవరకొండను ఈడీ ప్రశ్నించిందని వార్తలు వచ్చాయి. మరి ఈ ఇష్యూ ఎక్కడికి దాకా వెళ్తుందో చూడాలి. పూరీ జగన్నాధ్ ప్రస్తుతం కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి
puri jagannadh telugu addaప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు.  ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.


End of Article

You may also like