ధనుష్ హీరోగా నటించిన “తిరు” సినిమాలో… ఈ 3 తప్పులు సందేశాలని గమనించారా..?

ధనుష్ హీరోగా నటించిన “తిరు” సినిమాలో… ఈ 3 తప్పులు సందేశాలని గమనించారా..?

by kavitha

Ads

ధనుష్ గ్రే మ్యాన్ మూవీతో హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. దానితో అతను గ్లోబల్ లెవెల్ ఫేమస్ అయ్యాడు. అయితే ధనుష్ నుండి కొన్ని సార్లు చాలా రొటీన్ సినిమాలు వస్తాయి. మరోసారి సమాజాన్ని తట్టిలేపే సందేశాత్మక సినిమాలు వస్తాయి. మరి కొన్నిసార్లు హృదయానికి హత్తుకునే ఎమోషనల్ కథలతోనూ వస్తాడు.

Video Advertisement

ఇటీవల ధనుష్ తిరు సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు. తెలుగులో అంతగా ఆడకపోయిన, తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫీల్ గుడ్ సినిమాగా పిలవబడింది ఈ సినిమా. తిరు (ధనుష్) మధ్యతరగతి యువకుడు. అతనికి తండ్రితో కలిగిన సమస్యల కారణంగా కష్టపడుతుంటాడు. అతనికి చిన్నప్పటి స్నేహితురాలు శోభన (నిత్యామీనన్) అన్నివేళలా తిరుకు తోడుగా ఉంటుంది.తిరు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే క్రమంలో అనూష, రంజనిలను ప్రేమిస్తాడు అయితే వారు అతన్ని ప్రేమించరు. నిరాశలోకి వెళ్ళిన అతన్ని వాళ్ల తాత శోభన స్నేహాన్ని, ప్రేమగా చెప్పడంతో అక్కడ నుండి కథ మలుపు తీసుకుంటుంది.అయితే ఈ సినిమా అభిమానులకు నచ్చినప్పటికి, సూపర్ హిట్ అయినప్పటికీ మరికొంత మందికి నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కోరాలో ఈ సినిమా గూర్చి చర్చ జరుగగా, ఈ సినిమాలో మూడు ప్రధాన లోపాలను కలిగి ఉన్నట్టుగా ఒకరు చెప్పారు. ఇవి నేటి యువతను పూర్తిగా తప్పు దారిలో నడిపిస్తుందని అన్నారు.1. నిత్యా మీనన్ (శోభన) తనకు ప్రేమ కలిగిన వెంటనే తెలియజేసి ఉండాలని, అలా అప్పుడే చెప్పకుండా ఇరవై ఏళ్లు ఎందుకు ఎదురుచూసిందని, ధనుష్ (తిరు) తన తాత శోభన గురించి చెప్పేవరకు కూడా శోభన పై అతనికి ఏమీ అనిపించదు. 2. ఎదిగిన మనిషికి ఎదుటివారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియకుండా ఎలా ఉంటాడు. అది కాకుండా అతనికి ఎటువంటి ఫిలింగ్స్ లేకున్నా అతని తాత అతన్ని తప్పుదారి పట్టించాడు. ఇది కూడా అర్దం లేని విషయమే.3.ఈ సినిమా ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా దిగజార్చిందని, వారు నిజంగా స్నేహితులు అయినప్పటికీ, అసంబద్ధ కారణాలతో వారిని ఒకరినొకరు ప్రేమించేలా చేసింది.డైరెక్టర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ మంచి స్నేహితుడిగా ఎందుకు ఉండలేడు. ఇది 1980ల కాలం కాదు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా లేదు. మీరు 2022లో ఉన్నారు.ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, మూర్ఖత్వం ఇంజెక్ట్ చేయవద్దు అని అంటున్నారు.


End of Article

You may also like