Ads
ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా రూపొందింది. షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది.
Video Advertisement
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించారు. ఈ సినిమా టీజర్ పై చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమా బృందం కొన్ని మార్పులు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే సినిమా విడుదల ఆలస్యం అవుతుంది అని చెప్పారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో చాలా మార్పులు చేస్తున్నారు.
అలా చేయడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సారి సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అందుకే ప్రేక్షకులకి నచ్చడానికి చాలా శ్రద్ధ వహిస్తున్నారు. కానీ సినిమా ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సినిమాలో చేసే మార్పులు ఇంకా పెరిగాయి అని అంటున్నారు. ముందు ప్రభాస్ పాత్రకి సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు అన్నారు.
కానీ ఇప్పుడు ప్రభాస్ పాత్రలో కూడా మార్పులు చేస్తునట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ ముఖం విషయంలో, అలాగే గెటప్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో హీరో ప్రభాస్. అంటే సినిమా మొత్తం దాదాపు ప్రభాస్ ఉంటారు. ప్రభాస్ ఉన్న సీన్స్ చాలా ఉంటాయి. అందులో కొన్ని పోరాట సన్నివేశాలు కూడా ఉండి ఉంటాయి.
ఇలా చూస్తే ప్రతి సీన్ లో ప్రభాస్ గెటప్, ముఖం ఎడిట్ చేసి, అదంతా మళ్లీ సినిమాగా చేసి, ఈ సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి పంపించి, సినిమా రిలీజ్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పట్టేలాగా ఉంది. దాంతో వచ్చే సంవత్సరం చివరిలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ అప్పటికి కూడా సినిమా పని పూర్తి అవ్వకపోతే వచ్చే సంవత్సరం కూడా సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు అని అంటున్నారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత ఎడిట్ చేసే బదులు ఇంకో కొత్త సినిమా తీయొచ్చు కదా? అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏమైనా సరే ఈసారి అయినా ప్రేక్షకులకు నచ్చి సినిమా హిట్ అయితే చాలు అని అంటున్నారు. కానీ మరోపక్క ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.
End of Article