Ads
సాధారణంగా తెలిసినవారు కనిపించినపుడో, కలిసినపుడో మాట్లాడుకోవడం సహజమే. అలాంటి సమయంలో కుశల ప్రశ్నలు వేయడం కూడా సాధారణంగా జరిగే విషయమే. అయితే అది అమ్మాయిలను అడిగేటప్పుడు వాళ్ళు పెళ్ళికాని వారైతే ఎలాంటి ప్రశ్నలు వేయకూడదో, పెళ్లి అయిన అమ్మాయిలయితే ఏం అడగకూడదో చూద్దాం.
Video Advertisement
సహజంగా ఎవరైనా కలిసినపుడు, ఎటైనా వెళ్తున్నప్పుడైనా, ప్రయాణిస్తున్నప్పుడైనా యువతి లేదా యువకుడు, కొంచెం తెలిసినవరైనా కూడా అసలు పరిచయమే లేని వ్యక్తి అయినా సరే ఖాళీగా ఉండలేకనో, ఉబుసు పోకనో కొందరు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినపుడు పెళ్ళికాని అమ్మాయిలని ఎప్పుడు కూడా మీ పెళ్లి ఎప్పుడు అని అడగకూడదు.
ఎందుకంటే పెళ్లి అనేది ఆ అమ్మాయి వ్యక్తిగత విషయం. కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బంది కూడా పడవచ్చు. వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటారు.పెళ్లి అనేది చిన్న విషయం కాదు కాబట్టి, వాళ్ల జీవితంలో వారు తీసుకునే అతి పెద్ద నిర్ణయం. అది కూడా వాళ్ల ఇష్టమే. ఆ ప్రశ్న అడగటం కూడా ఒక రకంగా వ్యక్తిగతంగా బాధపెట్టినట్టే అవుతుంది.
ఇక పెళ్లి అయిన అమ్మాయి కనిపించగానే అడిగే ప్రశ్న పిల్లలు ఎప్పుడు అని, ఏ ప్రశ్న అడగకూడదో అడుగుతూ ఉంటారు కొందరు. కానీ పిల్లల గురించి ఆలోచించాల్సింది, ఎప్పుడు కనాలి అనేది కూడా పూర్తిగా భార్యభర్తలు తీసుకునే నిర్ణయం. వాళ్ళు ఉన్న పరిస్థితులని బట్టి, వారి ఆర్ధిక స్థితి బట్టి, పిల్లలల్ని ఎప్పుడు కానాలి.
పిల్లలల్ని కంటే వాళ్ళకి భవిష్యత్తుకి కావాల్సిన వనరులు ఇవ్వగలమా అని ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.కాబట్టి పెళ్లి అయిన అమ్మాయిలని ఇంకా పిల్లలు లేరా అని అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఆ ప్రశ్న కొందరికి ఇబ్బంది అనిపిస్తే, మరికొందరికి బాధను కలుగచేస్తుంది.
ఇదే ప్రశ్నలపై కోరలో చర్చ జరుగగా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. పెళ్లి , ఆ తరువాత పిల్లలని కనడం అనేది పూర్తిగా ఆ అమ్మాయిల వ్యక్తిగత విషయమని, విలైనంతవరకు అలాంటి ప్రశ్నలను ఆడగకుండా ఉండడమే సంస్కారం అనిపించుకుంటుదని అని తెలిపారు.
End of Article