Ads
మాస్ మహరాజ్ రవి తేజ అన్నా,
Video Advertisement
ఇది నువ్వేనా..? ఏమైనదన్నా నీకు..? ఇలా అయిపోయావ్ ఏంటి..? ఒకప్పుడు నీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. థియేటర్ దగ్గర జాతర జరుగుతున్నట్టు ఉండేది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు పండగ చేసుకునే వాళ్ళం. “రవన్న సినిమా అంటే డౌటే లేదు. పక్కా సూపర్ హిట్” అనే అంత నమ్మకంతో ఉండేవాళ్ళం.
ఇప్పుడేమో సినిమా వస్తుంది అంటే.. ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని.. ఒకవేళ ఫ్లాప్ వస్తే ఇంకో హిట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడు ఎలా ఉండేవాడివి అన్నా? ఎనర్జిటిక్ గా ఆ డైలాగులు, ఆ డాన్సులు, ఆ ఫైట్లే వేరు.. ఆ ఎనర్జీ ఏమైనదన్నా..? ఒకప్పటి రవితేజ ఏమైపోయాడు.?
నువ్వేమో కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వాలని చూస్తున్నావ్. కానీ వాళ్లేమో నీకెప్పుడు హిట్ ఇవ్వలేదు. ఒకప్పటి వెంకీ, ఒక ఇడియట్, మిరపకాయ, తీసిన రవితేజ ఎక్కడ? ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక నేనింతే లో ఉన్న నువ్వేనా అన్నా..? ఇప్పుడు ఇలా అయిపోయావ్.. పాత రవితేజను మళ్లీ 70 ఎమ్ఎమ్ స్క్రీన్ పై చూడాలని ఉందన్నా.. నీ స్క్రిప్ట్ సెలక్షన్ ఎందుకు ఇప్పుడు ఇలా ఉంటోంది.? అంత ఎనర్జీ పెట్టుకుని ఇలాంటి పాత్రలని ఎందుకు చేస్తున్నావ్ అన్నా..? ఇండస్ట్రీలో నీకున్న ఫ్యాన్ బేస్ వేరన్నా.. నువ్వు మాలో ఒకడివి అని ఫీల్ అవుతాం.
మాలో ఒకరు వెండితెరపై వెలిగిపోతున్నాడు అని నిన్ను చూసి మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఖడ్గం, వెంకీ, భద్ర, విక్కమార్కుడు, దుబాయ్ శీను,కిక్, బలుపు, క్రాక్ సినిమాలు హిట్ అవుతే వీధుల్లో సంబరాలు చేసుకున్నాం అన్నా.. నిప్పు, పవర్, బెంగాల్ టైగర్, డిస్కో రాజా, టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ, ఆ తర్వాత వచ్చిన రావణాసుర, ఈగల్, ఇప్పుడేమో మిస్టర్ బచ్చన్ చూస్తుంటే.. ఓ అభిమానిగా గుండె తరుక్కుపోతుందన్నా..
ఒకప్పుడు నీ సినిమాకు వెళ్తే మినిమం గ్యారంటీ అనిపించేదన్నా.. ఇప్పుడేంటి ఇలా అయ్యావు.. ఒక్కసారి వెనిక్కి వెళ్లి పాత రవితేజ ను స్క్రీన్ మీద చూయించన్నా.. రవితేజ సినిమా అంటే.. థియేటర్లలో విజిల్స్ పడాలి, కాగితాలు ఎగరాలి. మళ్ళీ మా మాస్ మాహారాజ్ హిట్టు కొట్టాడు అని మేము కాలర్ ఎగరేసుకు తిరగాలి అన్నా..
ఇట్లు
ఒకప్పటి రవితేజను తిరిగి తెరపై చూడాలని వేయి కళ్లతో ఎదురు చూసే నీ డైహార్డ్ ఫ్యాన్.
End of Article